ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ప్రస్తుతం సోషల్ మీడియా వార్‌ఫీల్డ్‌గా మారిపోయాయి. ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై ట్రోలింగ్ సునామీ నడుస్తోంది. తాజాగా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) టెక్నాలజీతో సృష్టించిన ఒక వీడియో రాష్ట్రవ్యాప్తంగా భారీ ప్రకంపనలు సృష్టించింది. ఈ వీడియో వైసీపీ వర్గాలను తీవ్ర ఆవేదనకు గురిచేయగా, ఈ మొత్తం వ్యవహారంపై మంత్రి నారా లోకేశ్ స్పందించిన తీరు... రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది!  వైరల్ వీడియో జగన్ 'అపోజిషన్ స్టేటస్' కోసం అభ్యర్థన! ..  ఆ వైరల్ వీడియోలో ఏం ఉందంటే ...
 

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేశ్‌లు కలిసి నడుచుకుంటూ వెళ్తుండగా... వైఎస్ జగన్ చేతిలో "ప్లీజ్ గివ్ మీ అపోజిషన్ స్టేటస్" (దయచేసి నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వండి) అంటూ ప్లకార్డు పట్టుకుని దీనంగా అడుగుతున్నట్లుగా ఉంది. రాజకీయ ప్రత్యర్థిని ఇంతలా టార్గెట్ చేసిన ఈ కంటెంట్... ఇంటర్నెట్‌లో మంటలు రేపింది. టీడీపీ అభిమానులు దీన్ని మాస్ లెవల్‌లో షేర్ చేయగా, అప్పుడే రంగంలోకి దిగారు మంత్రి నారా లోకేశ్. లోకేశ్ ఇచ్చిన 'నాగరికత' హితవు: హైక్లాస్ పొలిటికల్ మూవ్! .. సాధారణంగా ఇలాంటి సందర్భాల్లో ప్రత్యర్థులను మరింత రెచ్చగొట్టడం రాజకీయ నాయకులకు అలవాటు.  కానీ నారా లోకేశ్ మాత్రం అంచనాలకు భిన్నంగా స్పందించి, విలువలతో కూడిన రాజకీయాలకు కొత్త ప్రమాణాన్ని నెలకొల్పారు.

 

"నా ప్రియమైన టీడీపీ కుటుంబ సభ్యులారా... ఇలాంటి కంటెంట్ వెనుక ఉన్న భావోద్వేగాన్ని నేను అర్థం చేసుకోగలను. అయినప్పటికీ, వ్యక్తిగత దాడులు ఎప్పుడూ సరైనవి కావు. మనం రాజకీయ ప్రత్యర్థులం కావచ్చు, కానీ ప్రజా జీవితంలో గౌరవం, మర్యాద తప్పనిసరిగా పాటించాలి" అంటూ లోకేశ్ ధీమాగా ట్వీట్ చేశారు. తమ అభిమానులను ఉద్దేశించి "ఇలాంటి విషయాలను ఎవరూ ప్రోత్సహించకూడదు. విభేదాలు ఉన్నా, మనం నాగరికతను పాటించాలి. ఆంధ్రప్రదేశ్ బలోపేతానికి తోడ్పడే నిర్మాణాత్మక రాజకీయాలపైనే మన దృష్టి ఉండాలి" అని ఆయన గట్టిగా హితవు పలికారు. ఈ రకంగా, ప్రత్యర్థిని ట్రోల్ చేసి పరువు తీయకుండా, తన పార్టీ శ్రేణులకు గొప్ప సందేశాన్ని ఇచ్చి... లోకేశ్ తన రాజకీయ రాజసాన్ని ప్రదర్శించారు! ఇప్పుడు ఏపీ రాజకీయాలు అభివృద్ధి అనే లక్ష్యం వైపు దృష్టి పెట్టాలని ఆయన ఇచ్చిన మాస్ కాల్... సూపర్ హిట్!



మరింత సమాచారం తెలుసుకోండి: