బాలీవుడ్ స్టార్స్ ఎప్పటి నుంచో కూడా వెబ్ సిరీస్ లలో నటిస్తున్నారు. పాండమిక్ టైమ్ లో ఈ ట్రెండ్ అనేది మన టాలీవుడ్ లో కూడా మొదలైంది. తెలుగు నటీనటులు వెబ్ సిరీస్ లు ఇంకా ఒరిజినల్ మూవీస్ లో నటిస్తున్నారు. ఇంకా ఓవైపు బిగ్ స్క్రీన్ మీద సత్తా చాటుతూనే..ఇంకా మరోవైపు ఓటీటీలలో అలరిస్తున్నారు. అయితే విస్తృతమైన అవకాశాలు కల్పిస్తున్న ఓటీటీల గురించి బాలీవుడ్ హీరో జాన్ అబ్రహం వివాదాస్పద రీతిలో చాలా అగౌరవంగా మాట్లాడాడు.ఇటీవల ఓ ప్రముఖ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో జాన్ అబ్రహం ఓటీటీ ప్లాట్ ఫార్మ్స్ పై తన ఆలోచనలను పంచుకున్నాడు. అతడు బిగ్ స్క్రీన్ హీరోనని.. అందుకోసమే సినిమాలు చేస్తానని అన్నాడు.నటుడిగా కాకుండా నిర్మాతగా ఓటీటీ కోసం చిత్రాలను బ్యాంక్రోల్ చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు జాన్ పేర్కొన్నాడు.


"ఇక నేను పెద్ద స్క్రీన్ హీరోని. నేను అక్కడే కనిపించాలనే అనుకుంటున్నాను. రూ. 299 లేదా రూ. 499కి అందుబాటులో ఉండడం నాకు అసలు ఇష్టం లేదు. దానితో నాకు సమస్య అనేది ఉంది. ఎవరైనా నా సినిమాని ట్యాబ్లెట్ లో చూస్తూ మధ్యలో ఆపివేసి వాష్ రూమ్ కి వెళ్లాల్సిన అవసరం రావడం అనేది నాకు చాలా అభ్యంతరకరంగా ఉంటుంది" అని జాన్ అబ్రహం అన్నాడు.అయితే జాన్ అబ్రహం తాజా వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి. 


ఇక ఓటీటీలను కించపరిచినందుకు చాలా మంది అతడిని బాగా విమర్శిస్తున్నారు. ఇక ఇటీవల కాలంలో బిగ్ స్క్రీన్ మీద అతని సినిమాలు ఎన్ని విజయాలు సాధించాయని కూడా హెద్దేవా చేస్తున్నారు. జాన్ అబ్రహం నటించిన 'సత్యమేవ జయతే 2' మరియు 'ఎటాక్' సినిమాలు బాక్సాఫీస్ వద్ద దారుణ పరాజయాలు చవిచూసిన సంగతి తెలిసిందే.నెటిజన్స్ నువ్ కొంచెం ఓవరాక్షన్ తగ్గించుకుంటే చాలా మంచిది జాన్ అంటున్నారు.అలాగే ఇంకొందరు అయితే ఇప్పుడు నీ సినిమాలు చూడాలంటే మేము టాయిలెట్ ఆపుకొని చూడాలి. నీ నటన, నీ సినిమాలు అంత అద్భుతంగా ఉంటాయా అని చమత్కారంగా కామెంట్స్ చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: