క్రేజీ బ్యూటీ రష్మిక మ్యానియా ‘పుష్ప’ మూవీ తరువాత బాలీవుడ్ కు కూడ సోకింది. దీనితో ఆమెకు ఏకంగా రణబీర్ కపూర్ పక్కన నటించే అవకాశం కూడ వచ్చేసింది. దక్షిణాది టాప్ హీరోలందరూ ఆమెతో నటించడానికి ఉత్సాహపడుతున్న పరిస్థితులలో ఆమె పారితోషికం 3 కోట్ల స్థాయికి పెరిగి పోయింది.


రష్మిక పారితోషికం పెరగడమే కాకుండా ఆమె నిర్మాతలకు పెడుతున్న కండిషన్స్ కూడ పెరిగిపోతున్నాయి అన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. హీరోయిన్స్ సాధారణంగా బిజినెస్ క్లాసులో ప్రయాణిస్తారు. ఇప్పుడు రష్మిక కూడ అలాగే బిజినెస్ క్లాస్ లో ప్రయాణిస్తూ తనతో పాటు వ్యక్తిగత సహాయకులకు మేకప్ మేన్ కి హెయిర్ డ్రసర్ కు కూడ తనతో పాటు సమానంగా బిజినెస్ క్లాస్ టిక్కెట్లతో పాటు తనకు ఇచ్చినట్లుగా స్టార్ హోటల్స్ లో ఎకామిడేషన్ ఇమ్మని అడుగుతోందట.


అంతేకాదు తన పెంపుడు కుక్క తనను విడిచి ఉండలేకపోతోంది కాబట్టి ఆ పెట్ డాగ్ ను రష్మిక తాను ఎక్కడ షూటింగ్ కు వెళితే అక్కడకు తన కూడ తీసుకువెళ్ళాలి అన్న ఉద్దేశ్యంతో ఆ పెంపుడు కుక్క టిక్కెట్ చార్జీలను కూడ భరించాలని నిర్మాతలకు కండిషన్స్ పెడుతోందట. అయితే ఆ కుక్కను తాను ప్రయాణించే ఫ్లైట్ లోనే తీసుకు రావాలి అని చెపుతూ ఉండటంతో నిర్మాతలు ఆ కుక్క టిక్కెట్ల చార్జీల కోసం పెడుతున్న ఖర్చు బిజినెస్ క్లాస్ ధరకన్నా మించి పోవడంతో నిర్మాతలు హడిలి పోతున్నట్లు గాసిప్పులు వస్తున్నాయి.


సాధారణంగా టాప్ హీరోయిన్స్ అవుట్ డోర్ షూటింగ్ లకు వెళుతున్నప్పుడు షూటింగ్ అయిపోయిన తరువాత సాయంత్రం షాపింగ్ కు వెళ్ళి వారికి నచ్చిన రకరకాల వెరైటీ ఐటమ్స్ ను కొనుక్కుని ఆ బిల్స్ కూడ నిర్మాతలకు పంపుతారు అన్న మాటలు కూడ ఉన్నాయి. ఇన్ని కష్టాలు పడి భారీ సినిమాలు తీసిన నిర్మాతలు సినిమా హిట్ అయ్యేవరకు నిద్ర పట్టని రాత్రులు ఎన్నో ఉంటాయి..  మరింత సమాచారం తెలుసుకోండి: