సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం వరుస విజయాలను బాక్సాఫీస్ దగ్గర అందుకుంటూ ఫుల్ ఫామ్ లో ఉన్నాడు. బ్రహ్మోత్సవం స్పైడర్ లాంటి వరుస అపజయాలను బాక్సాఫీస్ దగ్గర అందుకున్న సూపర్ స్టార్ మహేష్ బాబు ఆ తర్వాత నుంచి వరసగా భరత్ అనే నేను, మహర్షి, సరిలేరు నీకెవ్వరు అలాగే తాజాగా సర్కారు వారి పాట సినిమాలతో  మొవీలతో వరుస పెట్టి విజయాలను అందుకని ఫుల్ జోష్ లో దూసుకుపోతున్నాడు.  

ఇది ఇలా ఉంటే వరుస విజయాలతో ఫుల్ జోష్ లో ఉన్న మహేష్ బాబు మరికొన్ని రోజుల్లో త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కబోయే సినిమాలో నటించబోతున్నాడు. ఈ మూవీ షూటింగ్ ఆగస్ట్ నెల నుండి ప్రారంభం కాబోతున్నట్లు తెలుస్తోంది. ఈ మూవీ లో పూజా హెగ్డే కథానాయికగా నటించబోతుంది.  ఇప్పటికే పూజా హెగ్డే , సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా తెరకెక్కిన మహర్షి సినిమాలో హీరోయిన్ గా నటించింది. అలాగే త్రివిక్రమ్ శ్రీనివాస్ గతంలో దర్శకత్వం వహించిన అరవింద సమేత, అలా వైకుంఠపురంలో సినిమాలలో కూడా పూజా హెగ్డే హీరోయిన్ గా నటించింది. ఈ సినిమాకు సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ సంగీతాన్ని అందించబోతున్నాడు. ఇది ఇలా ఉంటే ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కాకముందే , ఈ సినిమా విడుదల తేదీని చిత్ర బృందం కన్ఫర్మ్ చేసినట్లు తెలుస్తోంది.

ఈ సినిమాను 2023 సంక్రాంతి కానుకగా జనవరి 12 వ తేదీన విడుదల చేయాలని చిత్ర బృందం డిసైడ్ అయినట్లు తెలుస్తోంది. ఆగస్ట్ నెలలో షూటింగ్ ను ప్రారంభించి నాలుగు నెలల్లో షూటింగ్ మొత్తాన్ని పూర్తిచేసి, ఆ తర్వాత అతి తక్కువ రోజుల్లోనే పోస్ట్ ప్రొడక్షన్ పనులను కూడా కంప్లీట్ చేసి ఈ సినిమాను 2023 సంక్రాంతి కానుకగా విడుదల చేయాలని చిత్ర బృందం డిసైడ్ అయినట్లు తెలుస్తోంది. ఇలా మహేష్ బాబు సినిమా విషయంలో త్రివిక్రమ్ శ్రీనివాస్ పక్కా ప్లానింగ్ లో ఉన్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: