ప్రతి వారం ఎన్నో సినిమాలు విడుదల అవుతూ ఉంటాయి. అలాగే ప్రతి రోజు ఏదో ఒక సినిమాకు సంబంధించిన ఏదో ఒక అప్డేట్ విడుదల అవుతూ ఉంటుంది . అలాగే ఈ రోజు కూడా కొన్ని తెలుగు సినిమాలకు సంబంధించిన అప్డేట్ లు విడుదల కాబోతున్నాయి . ఆ సినిమాలు ఏమి టి ... ఆ సినిమాల నుండి రాబోతున్న అప్డేట్ లు ఏమిటో తెలుసుకుందాం .

దుల్కర్ సల్మాన్ హీరో గా మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సీతారామన్ సినిమా నుండి ఈ రోజు సెకండ్ సింగిల్ సాంగ్ ను ఈ రోజు ఉదయం 11 గంటలకు విడుదల చేయనున్నారు . ఈ సినిమాలో రష్మిక మందన ఒక కీలక పాత్రలో కనిపించబోతుంది .


శ్రీ విష్ణు హీరో గా తెరకెక్కుతున్న అల్లూరి సినిమా ట్రైలర్ ను ఈ రోజు 11 గంటల 07 నిమిషాలకు విడుదల చేయనున్నారు .


లావణ్య త్రిపాటి ప్రధాన పాత్రలో రితీశ్ రానా దర్శకత్వంలో తెరకెక్కిన హ్యాపీ బర్త్ డే సినిమా నుండి పార్టీ సాంగ్ ను ఈ రోజు సాయంత్రం 4 గంటల 5 నిమిషాలకు విడుదల చేయనున్నారు .


కళ్యాణ్ రామ్ హీరోగా తెరకెక్కుతున్న బింబిసార మూవీ ట్రైలర్ ను ఈ రోజు సాయంత్రం 5 గంటల 9 నిమిషాలకు విడుదల చేయనున్నారు.


మెగాస్టార్ చిరంజీవి హీరోగా మోహన్ రాజా దర్శకత్వంలో తెరకెక్కుతున్న గాడ్ ఫాదర్ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ను ఈ రోజు సాయంత్రం 5 గంటల 45 నిమిషాలకు విడుదల చేయనున్నారు.


నితిన్ హీరోగా తెరకెక్కుతున్న మాచర్ల నియోజకవర్గం మూవీ లోని స్పెషల్ సాంగ్ విడుదల తేదీని ఈరోజు ప్రకటించబోతున్నారు. ఈ సినిమాలో నితిన్ హీరోగా నటిస్తుండగా కృతి శెట్టి , క్యాథరీన్ హీరోయిన్ గా నటిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: