యంగ్ అండ్ ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని ప్రస్తుతం తమిళ దర్శకుడు లింగుస్వామి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ది వారియర్ అనే భారీ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ లో హీరోగా నటిస్తున్న విషయం మన అందరికి తెలిసిందే. ఈ మూవీ లో రామ్ పోతినేని సరసన కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తుండగా, ఆది పినిశెట్టి ప్రతి నాయకుడి పాత్రలో కనిపించబోతున్నాడు.

మూవీ కి దేవి శ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్నాడు. ఈ మూవీ ని జూలై 14 వ తేదీన తెలుగు మరియు తమిళ భాషల్లో విడుదల చేయనున్నారు. ఈ సినిమా విడుదల తేది దగ్గర పడడంతో ఇప్పటికే చిత్ర బృందం ఈ సినిమా ప్రమోషన్  లను వేగ వంతం చేసింది. అందులో భాగంగా ఇప్పటికే ఈ సినిమా టీజర్ , ట్రైలర్ , కొన్ని పాటలను కూడా విడుదల చేయగా వాటికి ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ లభిస్తోంది. తాజాగా ది వారియర్ చిత్రబృందం ఈ సినిమా తమిళ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ను కూడా భారీ ఎత్తున నిర్వహించింది. ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు కోలీవుడ్ ఇండస్ట్రీ కి సంబంధించిన ఎంతో మంది ముఖ్య అతిథులుగా విచ్చేసారు. ఇది ఇలా ఉంటే ది వారియర్ సినిమా తెలుగు ప్రీ రిలీజ్ ఈవెంట్ కు కూడా ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది.

సినిమా తెలుగు ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ను జూలై 10 వ తేదీన జే ఆర్ సి కన్వెన్షన్, హైదరాబాద్ లో నిర్వహించాలని చిత్ర బృందం డిసైడ్ అయినట్లు తెలుస్తుంది. ఇది ఇలా ఉంటే ఇప్పటికే ఈ సినిమా నుండే చిత్ర బృందం విడుదల చేసిన ప్రచార చిత్రాలు, టీజర్, ట్రైలర్ లు అన్నీ కూడా అదిరిపోయే రేంజ్ లో ఉండడంతో ఈ సినిమాపై సినీ ప్రముఖులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. మరి ఈ సినిమా ఎలాంటి విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకుంటుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: