టాలెంటెడ్ దర్శకులలో ఒకరు అయిన విక్రమ్ కె కుమార్ గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. 13 బి సినిమాతో దర్శకుడిగా మంచి క్రేజ్ ను సంపాదించుకున్న విక్రమ్ కె కుమార్ ఆ తర్వాత నితిన్ హీరోగా నిత్య మీనన్ హీరోయిన్ గా తెరకెక్కిన ఇష్క్ మూవీ తో టాలీవుడ్ ఇండస్ట్రీలో అదిరిపోయే బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకోవడం మాత్రమే కాకుండా దర్శకుడిగా తానేంటో నిరూపించుకున్నాడు.

ఆ తర్వాత మనం సినిమాతో మరో అదిరిపోయే విజయాన్ని బాక్సాఫీస్ దగ్గర అందుకున్న విక్రమ్ కె కుమార్ టాలీవుడ్ ఇండస్ట్రీలో ఫుల్ క్రేజీ దర్శకుడిగా మారిపోయాడు. ఆ తర్వాత ఈ దర్శకుడు 24 , హలో , గ్యాంగ్ లీడర్ వంటి సినిమాలకు దర్శకత్వం వహించాడు. ఇది ఇలా ఉంటే తాజాగా విక్రమ్ కె కుమార్ థాంక్యూ మూవీ కి దర్శకత్వం వహించాడు. ఈ సినిమాలో నాగ చైతన్య హీరోగా నటించగా రాశి కన్నా హీరోయిన్ గా నటించింది. ఈ సినిమా జూలై 22 వ తేదీన విడుదల కాబోతుంది. ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడటంతో విక్రమ్ కె కుమార్సినిమా ప్రమోషన్ లో భాగంగా అనేక ఇంటర్వ్యూ లలో పాల్గొంటూ ఈ మూవీ ని ప్రమోట్ చేస్తున్నాడు. అందులో భాగంగా తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న విక్రమ్ కె కుమార్ తదుపరి ప్రాజెక్ట్ ల గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను తెలియజేశాడు.

విక్రమ్ కె కుమార్ ప్రస్తుతం నాగ చైతన్య తో ఒక హారర్ వెబ్ సిరీస్ ను చేస్తున్నాను , ఆ వెబ్ సిరీస్ షూటింగ్ చివరి దశకు చేరుకుంది. అలాగే యాక్షన్ జోనర్ లో కొనసాగే ఒక హిందీ సినిమా చేయబోతున్నాను. movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ లో ఒక సినిమా చేయబోతున్నాను అని విక్రమ్ కె కుమార్ తన తదుపరి ప్రాజెక్ట్ ల గురించి తెలియజేశాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: