లవ్ స్టోరీ ఇంకా బంగార్రాజు సినిమాల సక్సెస్ తరువాత నాగచైతన్య చేసిన సినిమా థాంక్యూ. ఇక మనం సినిమా లాంటి క్లాసిక్ హిట్ తరువాత నాగచైతన్యతో దర్శకుడు విక్రమ్ కె కుమార్ తెరకెక్కించిన సినిమా థ్యాంక్యూ.ఇక ఎట్టకేలకు ఈ సినిమా ఈ రోజు అనగా జూలై 22, 2022 న థియేటర్లలో విడుదలయ్యింది. అంకంటే ముందే యూఎస్ లో ఈ సినిమా ప్రీమిర్స్ షోలు పడ్డాయి.ఈ సినిమాతో హ్యాట్రిక్ హిట్ కొట్టాలి అని ఎదురు చూస్తున్న నాగచైతన్యకు థాంక్యూ సినిమా కలిసి వస్తుందా.. సినిమా చూసిన ఆడియన్స్ ఇక ఎలా స్పందిస్తున్నారు తెలుసుకుందాం.


ఇక ఈ సినిమా కథ విషయానికి వస్తే... నారాయణపురం అనే చిన్న గ్రామానికి చెందిన అభిరామ్ తన ఊరు నుండి వెళ్లి బిలినియర్ ఎలా అయ్యాడు. ఇంకా ఒక కంపెనీని యజమాని ఎలా అయ్యాడు? అనే పాయింట్ తో సినిమా నడుస్తుంది. ఇంకా అతను ఎప్పుడూ తన సొంతంగా ఎవరి సహాయం లేకుండా ఎదిగాను అనుకుంటు బతికేస్తాడు, అయితే ఒక రోజు తన ప్రయాణం ఇంకా అతని విజయం వెనుక చాలా మంది వ్యక్తుల ఉన్నారని అతను తెలుసుకుంటాడు.ఇక అప్పటి నుండి అతను వారి పట్ల తన కృతజ్ఞత చూపాలని నిర్ణయించుకుంటాడు. మరి తను తన కృతజ్ఞతా భావాన్ని ఎలా చూపిస్తాడు? అనేది ఈ సినిమా కథ.


మొత్తానికి సినిమా చాలా బాగుంది.. నాగచైతన్య అద్భుతం అని కొందరు అంటుంటే... మరికొంత మంది అక్కడక్కడా కొన్ని మైనస్ లు ఉన్నాయని అంటున్నారు.ఇక ఈ థ్యాంక్యూ సినిమాకు మూడు హైలెట్ గా నిలిచాయి.. అవి ఏంటీ అంటే.. తమన్ బీజియం, ఇంకొంకట పిసి శ్రీరామ్ సినిమాటోగ్రఫీ ఇంకా సూపర్ స్టార్ మహేష్ రిఫరెన్స్. ఈ 3 ఎలిమెంట్స్ కూడా సినిమాకు భాగా ప్లస్ అయ్యాయి అంటున్నారు జనాలు. ఇక ఫస్ట్ హాఫ్ చాలా బాగుందని సెకండ్ హాఫ్ పర్వాలేదు అని ఆడియన్స్ కామెంట్లు చేస్తున్నారు.ముఖ్యంగా మహేష్ రిఫరెన్స్ తో వచ్చే సీన్స్ అయితే థియేటర్ లో అరుపులు పెట్టించాయట. ఇక చైతూ యాక్టింగ్ అయితే ఒక అద్భుతం అని కొనియాడుతున్నారు జనాలు. మొత్తానికి ఈ సినిమాతో చైతూ హ్యాట్రిక్ హిట్ కొట్టినట్లే..

మరింత సమాచారం తెలుసుకోండి: