తమిళ డైరెక్టర్ అయినప్పటికీ పవన్ కళ్యాణ్ తో సినిమా చేయాలని హైదరాబాద్ కు వచ్చి తనకు కథను వినిపించారు. అయితే కథ చెప్పిన కొన్ని రోజుల తర్వాత పవన్ కళ్యాణ్ ఆలోచించి.. కథలో కొన్ని మార్పులను చేయించి మళ్లీ కథను మార్చి చెప్పడంతో ఆ వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట ఈ సినిమా విడుదలై ఈరోజుకి 24 సంవత్సరాలు కావస్తోంది. 1998లో ఈ సినిమా ఎటువంటి అంచనాలు లేకుండా విడుదలై బాక్సాఫీస్ దగ్గర మంచి విజయాన్ని అందుకున్నది. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర దాదాపుగా రూ. 9 కోట్ల రూపాయల కలెక్షన్లను అందుకున్నట్లు తెలుస్తోంది.
ముఖ్యంగా పవన్ కళ్యాణ్ కెరియర్ లోని ఈ సినిమా అత్యధిక కలెక్షన్లు సాధించిన సినిమాగా క్రేజ్ అందుకుంది. ఇక ఈ సినిమా తర్వాత పవన్ కళ్యాణ్ రోజు ఒక్కసారిగా మారిపోయింది అలాగే డైరెక్టర్ కరుణాకర్ కు కూడా మంచి డిమాండ్ ఏర్పడింది. ఈ సినిమాలోని పాటలు ఇప్పటికీ కూడా ఆల్ టైమ్ బెస్ట్ సాంగ్స్ గా నిలిచాయి. 2018లో వరుణ్ తేజ్ తొలిప్రేమ టైటిల్ తో విడుదల కాక ఈ సినిమా కూడా బాక్సాఫీస్ దగ్గర మంచి విజయాన్ని అందుకున్నది. అయితే పవన్ కళ్యాణ్ కు మాత్రం మంచి క్రేజ్ తెచ్చి పెట్టిన సినిమాగా ఉందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.