క్రియేటివ్ దర్శకుడు హను రాఘవ పూడి సినిమాలు చాల డిఫరెంట్ గా ఉంటాయి. ‘అందాల రాక్షసి’ మూవీతోనే తాను వైవిద్యంగా ఎలా సినిమాలు తీయగలడు ఇండస్ట్రీకి తెలియచేసాడు. ఆతరువాత వచ్చిన ‘క్రిష్ణగాడి వీర ప్రేమ గాధ’ ‘లై’ ‘పడిపడి లేచె మనసు’ సినిమాలకు విమర్శకుల ప్రశంసలు లభించాయి కాని ఆమూవీలు ఏవి సూపర్ హిట్ కాకపోవడంతో అతడి కెరియర్ గ్రాఫ్ పెద్దగా పెరగలేదు.


ఇలాంటి పరిస్థితులలో మళయాళ ఫిలిం ఇండస్ట్రీ టాప్ యంగ్ హీరో దుల్కర్ సల్మాన్ హను రాఘవ పూడిని నమ్మి చేస్తున్న ‘సీత రామం’ మూవీ పై మంచి అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన దుల్కర్ సల్మాన్ తెలుగులో డైరెక్ట్ గా చేస్తున్న మూవీ ఇది. మృణాల్ ఠాకూర్ హీరోగా నటిస్తున్న ఈమూవీలో రస్మిక ఒక ప్రత్యేక పాత్రలో కనిపిస్తోంది.


‘యుద్ధంతో వ్రాసిన ప్రేమకథ’ అన్న ఆలోచనల చుట్టూ ఈమూవీ కథ నడవబోతోంది. హను రాఘవపూడి కి ఖాళీ దొరికినప్పుడల్లా కోఠీ కి వెళ్ళి అక్కడ దొరకే పాత పుస్తకాలను కొనడం అతడి హాబి. అలా ఒకసారి ఒక పాత పుస్తకాల షాపుకు వెళ్ళినప్పుడు ఆ పుస్తకాల షాపులోని ఒక పాత పుస్తకంలో ఒక ఓపెన్ చేయని లెటర్ దొరికింది. ఆ లెటర్ ఒక తల్లి తన కొడుకుకి తన బాధలు వివరిస్తూ వ్రాసిన ఉత్తరం అది.


ఆ ఉత్తరం ఓపెన్ చేయకపోవడంతో ఆతల్లి పడే బాధ ఆకొడుకు కు తెలిసి ఉండకపోవచ్చు ఇప్పుడు ఇదే పాయింట్ ను ఆధారంగా చేసుకుని హను రాఘవ పూడి ఒక అజ్ఞాత ప్రేమికు  రాలు సైన్యంలో పనిచేసే ఒక వ్యక్తికి వందల సంఖ్యలో ఉత్తరాలు వ్రాస్తే ఆ ప్రేమకథ ఏమౌతుంది అన్న పాయింట్ చుట్టూ ఈమూవీ కథ తిరుగుతుందని హను రాఘవ పూడి చెపుతున్నాడు. సినిమా చూడటానికి కావలసింది క్యురియాసిటీ కాని దాని బడ్జెట్ కాదు అంటూ కథ డిఫరెంట్ గా అనిపించినప్పుడే ప్రేక్షకులు ధియేటర్లకు వస్తారని లేకుంటే ధియేటర్లకు రారు అని హను రాఘవ పూడి భావన..

మరింత సమాచారం తెలుసుకోండి: