మాస్ మహారాజా రవితేజ తాజాగా రామారావు ఆన్ డ్యూటీ అనే మూవీ లో హీరోగా నటించిన విషయం మనందరికీ తెలిసిందే. ఈ మూవీ లో రవితేజ సరసన రాజిష  విజయన్ , దివ్యాంశ కౌశిక్ హీరోయిన్ లుగా నటించగా , శరత్ మండవ ఈ మూవీ కి దర్శకత్వం వహించాడు. ఈ సినిమా మంచి అంచనాల నడుమ జూలై 29 వ తేదీన థియేటర్ లలో విడుదల అయ్యింది.

మంచి అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా బాక్సా ఫీస్ దగ్గర మొదటి రోజే నెగిటివ్ టాక్ ను సొంతం చేసుకుంది. అలా ఈ మూవీ కి మొదటి రోజే బాక్సా ఫీస్ దగ్గర నెగిటివ్ టాక్ రావడంతో ఈ మూవీ కి ప్రస్తుతం కలెక్షన్ లు కూడా మూవీ యూనిట్ ఆశించిన రేంజ్ లో దక్కడం లేదు. ఇది ఇలా ఉంటే ఈ సినిమా విడుదలకు ముందు ఈ మూవీ యూనిట్ ఈ సినిమా నుండి విడుదల చేసిన ప్రచార చిత్రాలు అదిరిపోయే రేంజ్ లో ఉండడంతో ఈ మూవీ కి ప్రపంచ వ్యాప్తంగా 17.20 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. అలా 17.20 కోట్ల  ప్రీ రిలీజ్ బిజినెస్ ను జరుపుకున్న ఈ సినిమా 18 కోట్ల భారీ టార్గెట్ తో బాక్స్ ఆఫీస్ బరిలోకి దిగింది.

ఇప్పటి వరకు నాలుగు రోజుల బాక్సా ఫీస్ రన్ ని కంప్లీట్ చేసుకున్న రామారావు ఆన్ డ్యూటీ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రపంచ వ్యాప్తంగా 4.63 కోట్ల షేర్, 8.10 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది. దీనితో ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా ఇంకా 13.37 కోట్ల షేర్ కలెక్షన్ లను గనక వసూలు చేసినట్లు అయితే ఈ మూవీ ప్రపంచ వ్యాప్తంగా బ్రేక్ ఫార్ములా ను కంప్లీట్ చేసుకొని సక్సెస్ ఫుల్ మూవీ గా నిలుస్తుంది. మరి రాబోయే రోజుల్లో రామారావు ఆన్ డ్యూటీ మూవీ  బాక్స్ ఆఫీస్ దగ్గర ఏ రేంజ్ కలెక్షన్ లను వసూలు చేస్తుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: