విజయ్ దేవరకొండ హీరోగా నటించిన లైగర్ సినిమాకు సంబంధించిన సెన్సార్ ఇటీవలే పూర్తయింది. దానికి గాను యు/ఏ సర్టిఫికెట్ అందుకుంది చిత్ర బృందం. బాక్సింగ్ నేపథ్యంలో రూపొందిన ఈ చిత్రాన్ని దర్శకుడు పూరీ జగన్నాథ్ తాను సినిమాలకు రెగ్యులర్ గా తీసుకునే తక్కువ సమయాన్ని కాకుండా ఎక్కువ సమయాన్ని తీసుకోవడం పట్ల అందరూ ఎంతో ఆసక్తి వ్యక్తపరుస్తున్నారు. చిత్రం పట్ల ఉన్న అంచనాలు రోజు రోజుకు పెరిగిపోతున్న నేపథ్యంలో తాజాగా సెన్సార్ సభ్యులు చెప్పిన మాట కూడా ఈ చిత్రం భారీ స్థాయిలోనే ప్రేక్షకులను అలరించబోతుందన్న టాక్ వినబడుతుంది.

బాలీవుడ్ తో పాటు పలు సౌత్ భాషలలో కూడా విడుదలవుతున్న ఈ చిత్రం లో బాలీవుడ్ కథానాయిక అనన్య పాండే హీరోయిన్ గా నటిస్తుంది. రమ్యకృష్ణ ఓ కీలక పాత్రలో నటిస్తూ ఉండగా మైక్ టైసన్ అతిధి పాత్రలో నటించడం విశేషం. ఆ విధంగా ఆగస్టు 25వ తేదీన ఎన్నో అంచనాల మధ్య విడుదలవుతున్న ఈ చిత్రం తప్పకుండా విధ్వంసాన్ని సృష్టిస్తుందని ప్రతి ఒక్కరు కూడా భావిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి వచ్చిన అప్డేట్లన్నీ కూడా అందరినీ విశేషంగా ఆకట్టుకున్నాయి. 

ఈరోజే విడుదలైన పాటకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన కూడా వస్తుంది. మరి తెలుగులో భారీ విజయాన్ని అందుకొని చాలా రోజులే అయిపోయిన నేపథ్యంలో విజయ్ దేవరకొండ ఈ సినిమాతో ఎంతటి స్థాయి విజయాన్ని తన ఖాతాలో వేసుకుంటాడో చూడాలి. ఈ చిత్రం తర్వాత ఇదే దర్శకుడు తో కలిసి జనగణమన అనే మరొక సినిమాను కూడా మొదలు పెట్టాడు విజయ్ దేవరకొండ. ఈ సినిమా ను వచ్చే ఏడాది ఆగస్ట్ 3 న విడుదల చేయడానికి సన్నాహాలు చేశాడు. ఈ చిత్రం లో హీరోయిన్ గా పూజా హెగ్డే నటిస్తుంది. వంశీ పైడిపల్లినిర్మాత గా వ్యవహరిస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: