నితిన్ హీరోగా రూపొందిన మాచర్ల నియోజకవర్గం సినిమా వచ్చే వారం విడుదల అవుతుంది. ఆగస్టు 12వ తేదీన ఎన్నో అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ చిత్రంపై ప్రతి ఒక్కరు కూడా ఎంతో ఆసక్తిని కనబరుస్తున్నారు. గత కొన్ని సినిమాలుగా ఏమాత్రం విజయాన్ని అందుకోలేక పోతున్న నితిన్ ఇప్పుడు చేస్తున్న ఈ సినిమాపై మంచి నమ్మకాన్ని ఏర్పరుస్తున్నాడు.

ఆయన అభిమానులు కూడా ఈ సినిమా కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నట్లుగా సోషల్ మీడియాలో కామెంట్ల ద్వారా వెల్లడి చేస్తున్నారు. అయితే ఈ సినిమా యొక్క రేంజ్ ఒక్కసారిగా మారిపోవడానికి కారణం ఇటీవలే చిత్రం నుంచి వచ్చిన ఒక పాట అనే చెప్పాలి. ఒక ఐటెం సాంగ్ తో ఈ సినిమాపై ప్రేక్షకులలో కదలిక వచ్చింది. అంజలి ఈ సాంగులో స్పెషల్ అపీరియన్స్ ఇవ్వగా మాస్ ప్రేక్షకులకు ఈ పాట ఎంతగానో ఎక్కింది.

 తాజాగా ఈ పాటకు 500 మిలియన్స్ రావడం సినిమా పట్ల ఎంతటి ఆసక్తి ప్రేక్షకులలో ఉంది అని చెప్పడానికి ముఖ్య కారణం అవుతుంది. ఈ చిత్రంలో హీరోయిన్ గా కృతి శెట్టి నటించడం ఒక విశేషం. మరి ఇన్ని విశేషాలు కలిగిన ఈ చిత్రం ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో చూడాలి. రాజశేఖర్ రెడ్డి ఈ చిత్రానికి దర్శకత్వం వహించగా అంతకుముందు ఎన్నో చిత్రాలకు సినిమాటోగ్రాఫర్ గా పనిచేసి మంచి విజయాలను అందుకున్న ఆయన తొలిసారి దర్శకత్వం వహిస్తూ తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు. ఇటు నితిన్ కి ఈ సినిమా ఎంత ముఖ్యమో ప్రతి ఒక్కరికి తెలిసిందే. ఇటీవల కాలంలో మాస్ ప్రేక్షకులను అలరించే సినిమా ఆయన చేసింది చాలా తక్కువ. చాలా రోజుల తర్వాత ఫుల్ మాస్ మసాలా కమర్షియల్ ఎంర్టైనర్ గా తో ఈ చిత్రం చేయబోతున్న ఈ హీరో ఈ సినిమాతో ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో మరి. 

మరింత సమాచారం తెలుసుకోండి: