టాలీవుడ్ ఇండస్ట్రీ లో మోస్ట్ క్రేజీ హీరోయిన్ గా కొనసాగుతున్న కృతి శెట్టి గురించి సినీ ప్రేమికులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. వరుస అవకాశాలతో ఫుల్ స్పీడ్ లో దూసుకుపోతున్న కృతి శెట్టి తాజాగా టాలీవుడ్ యంగ్ హీరోల్లో ఒకరైన నితిన్ హీరోగా తెరకెక్కిన మాచర్ల నియోజకవర్గం మూవీ లో హీరోయిన్ గా నటించింది. ఈ మూవీ కి ఎన్ ఎస్ రాజశేఖర్ రెడ్డి దర్శకత్వం వహించాడు. ఈ మూవీ ని ఆగస్ట్ 12 వ తేదిన విడుదల చేయనున్నారు. ఈ మూవీ విడుదల తేదీ దగ్గర పడటంతో ఈ మూవీ యూనిట్ వరుస ఇంటర్వ్యూ లలో పాల్గొంటూ మూవీ ని ప్రమోట్ చేస్తున్నారు.

అందులో భాగంగా తాజాగా మాచర్ల నియోజకవర్గం మూవీ లో హీరోయిన్ గా నటించిన కృతి శెట్టి ఓ ఇంటర్వ్యూ లో పాల్గొంది . తాజా ఇంటర్వ్యూ లో భాగం గా కృతి శెట్టి 'మాచర్ల నియోజకవర్గం' మూవీ గురించి అనేక ఆసక్తికరమైన విషయాలను తెలియ జేసింది . తాజా ఇంటర్వ్యూలో ప్రతి శెట్టి మాట్లాడుతూ ... మాచర్ల నియోజకవర్గం మూవీ కథ గురించి అప్పుడే ఎక్కువ చెప్పకూడదు కానీ ,  నేను విన్న వెంటనే ఓకే చెప్పిన కథ ఇది. అద్భుతమైన కథ.  సినిమా సూపర్ ఎంటర్ టైనింగ్ గా ఉంటుంది. పొలిటికల్ టచ్ తో పాటు మంచి కామెడీ , యాక్షన్ , సాంగ్స్ అన్నీ కూడా ఈ మూవీ లో ఉంటాయి అని తాజా ఇంటర్వ్యూ లో కృతి శెట్టి చెప్పుకొచ్చింది. ఈ మూవీ లో నితిన్ కలెక్టర్ పాత్రలో కనిపించబోతున్నాడు. ఈ మూవీ లో లో సముద్ర ఖని ప్రతినాయకుడి పాత్రలో నటించగా ,  మహతి స్వర సాగర్ ఈ మూవీ కి సంగీతాన్ని అందించాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: