యంగ్ టైగర్ ఎన్టీఆర్ రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఆర్ ఆర్ ఆర్ సినిమా ద్వారా పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు పొందారు. ఇక ఈ సినిమా తరువాత తారక్ నటించే సినిమాలన్నీ కూడా పాన్ ఇండియా స్థాయిలోనే నిర్మించాలని భావించారు.ఈ క్రమంలోనే ఎన్టీఆర్ తన 30వ సినిమాని స్టార్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో చేయనున్నట్లు అధికారకంగా ప్రకటించారు. అయితే కొరటాల శివ దర్శకత్వంలో వచ్చిన ఆచార్య సినిమా పెద్ద డిజాస్టర్ కావడంతో స్క్రిప్ట్ విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటూ తిరిగి స్క్రిప్ట్ లో మార్పులు చేయటం వల్ల ఈ సినిమా కాస్త ఆలస్యం అవుతుంది.ఇకపోతే ఈ సినిమా షూటింగ్ పనులు ఆగస్టు నెల రెండవ వారం నుంచి  ప్రారంభమవుతాయని భావించారు. కానీ తాజాగా ఎన్టీఆర్ అనారోగ్య కారణంగా ఈ సినిమా మరికొంత కాలం పాటు వాయిదా పడుతుందని సమాచారం తెలుస్తోంది. జూనియర్ ఎన్టీఆర్ గత కొద్ది రోజుల నుంచి భుజం నొప్పితో బాధపడుతున్నారని అయితే వైద్య పరీక్షలు చేయించిన అనంతరం ఈయన కొన్ని రోజులపాటు విశ్రాంతి తీసుకోవాల్సిన అవసరం కూడా ఎంతైనా ఉందంటూ వైద్యులు ప్రకటించారు.


ఈ క్రమంలోనే ఎన్టీఆర్ కి ప్రస్తుతం విశ్రాంతి చాలా అవసరం అవడంతో కొరటాల సినిమా మరి కాస్త ఆలస్యం కానున్నట్లు సమాచారం తెలుస్తోంది.ఆర్ ఆర్ ఆర్ సినిమాలో ఎన్టీఆర్ తో పాటు నటించిన రామ్ చరణ్ ఆచార్య సినిమాలో నటించడమే కాకుండా ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా షూటింగ్ లో చాలా బిజీగా ఉన్నారు.కానీ ఎన్టీఆర్ మాత్రం ఆర్ ఆర్ ఆర్ సినిమా తర్వాత కొట్టాల శివతో సినిమా ప్రకటించినప్పటికీ ఈ సినిమా ఇప్పటికీ షూటింగ్ పనులు ప్రారంభం కాకపోవడంతో ఎన్టీఆర్ అభిమానులు కాస్త ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే కొరటాల ఎన్టీఆర్ సినిమా అక్టోబర్ నెలలో ప్రారంభమవుతుందని వార్తలు వస్తున్నాయి.అయితే ఇక ఈ విషయం గురించి స్పష్టత రావాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: