గత కొంతకాలం నుంచి వరుస సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వస్తున్న యువ హీరో నితిన్ సూపర్ హిట్ కోసం అయితే వేచి చూస్తున్నాడు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు అని చెప్పాలి. ఎందుకంటే ఎన్నో వైవిధ్యమైన కథలతో ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఎందుకో సరైన హిట్ కొట్ట లేక పోతున్నాడు  ఇకపోతే మరికొన్ని రోజుల్లో మాచర్ల నియోజకవర్గం అనేక కమర్షియల్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఈ సినిమాకు సంబంధించి విడుదలైన ట్రైలర్ ఇప్పటికే ప్రేక్షకుల్లో అంచనాలు పెంచేసింది అని చెప్పాలి.


 ఇక ఈ సారి నితిన్ ఊర మాస్ యాక్షన్ తో ప్రేక్షకులకు కనువిందు చేయబోతున్నాడు అన్నది తెలుస్తోంది. కాగా ఈ సినిమా ప్రమోషన్స్ లో ప్రస్తుతం బిజీబిజీగా ఉన్నాడు నితిన్. ఈ క్రమంలోనే ఒక సినిమా చూసి తనకు నిద్ర కూడా పట్టలేదు అంటూ చెప్పుకొచ్చాడు. లోకనాయకుడు కమల్ హాసన్ కెరీర్లో మైలురాయిగా నిలిచిపోయిన సినిమా విక్రమ్. పాన్ ఇండియా రేంజ్లో ప్రభంజనం సృష్టించింది. అయితే ఈ సినిమాని శ్రేష్ట్ మూవీస్ బ్యానర్ పై హీరో నితిన్, సుధాకర్ రెడ్డి తెలుగులో రిలీజ్ చేశారు అన్న విషయం తెలిసిందే. సినిమా సూపర్ హిట్ అవడంతో వీరికి మంచి లాభాలు కూడా వచ్చాయి.


 అయితే ఇటీవలే తన సినిమా మాచర్ల నియోజకవర్గం ప్రమోషన్స్ లో భాగంగా విక్రమ్ సినిమా గురించి తన మనసులో మాట చెప్పాడు.  విక్రమ్ సినిమా చూసిన తర్వాత వారం రోజులు నిద్ర పట్టలేదు. సినిమా అంటే ఇలా ఉండాలి కదా ఇలా తీయాలి కదా అని అనిపించింది. ఒకే మూసలో ఉండే ఫార్ములా కాకుండా కథని  బలంగా నమ్మి చేస్తే విక్రమ్ లాంటి సినిమాలు వస్తాయి అని అర్థమైంది అంటూ చెప్పుకొచ్చాడు. భవిష్యత్తులో అలాంటి బలమైన కథలు వస్తే తప్పకుండా చేస్తాను అంటూ నితిన్ తెలిపాడు. ఇక కరోనా వైరస్ తర్వాత ప్రేక్షకుల స్వింగ్ ఏంటో అర్థం కావడం లేదు అంటూ చెప్పుకొచ్చాడు నితిన్.

మరింత సమాచారం తెలుసుకోండి: