హాట్ బ్యూటీ సన్నీ లియోన్ గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. సన్నీ లియోన్ బాలీవుడ్ చిత్రాల ద్వారా ఇండియా వ్యాప్తంగా అదిరిపోయే గుర్తింపును దక్కించుకుంది. అలా బాలీవుడ్ సినిమాల ద్వారా అద్భుతమైన గుర్తింపు దక్కించుకున్న సన్నీ లియోన్ కొన్ని సంవత్సరాల క్రితం మంచు మనోజ్ హీరోగా రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా తెరకెక్కిన కరెంట్ తీగ అనే తెలుగు మూవీ లో నటించి ప్రేక్షకులను అలరించింది. ఇలా కరెంటు తీగ సినిమా ద్వారా నేరుగా తెలుగు మూవీ లో నటించి ప్రేక్షకులను అలరించిన ఈ ముద్దు గుమ్మ ప్రస్తుతం మంచు విష్ణు హీరోగా తెరకెక్కుతున్న జిన్నా మూవీ లో హీరోయిన్ గా నటిస్తోంది. ఈ మూవీ కి సూర్య దర్శకత్వం వహిస్తున్నాడు. 

ఇది ఇలా ఉంటే తాజాగా జిన్నా మూవీ మేకర్స్ ఈ మూవీ కి  సంబంధించిన ఒక క్రేజీ అప్డేట్ ను విడుదల చేసింది. ఈ మూవీ లోని సన్నీ లియోన్ కు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ ను తాజాగా చిత్ర బృందం విడుదల చేసింది. అలాగే  సన్నీ లియోన్ ఈ మూవీ లో రేణుక అనే పాత్రలో నటించబోతున్నట్లు కూడా మూవీ యూనిట్ అధికారికంగా ప్రకటించారు. చిత్ర బృందం విడుదల చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్ లో సన్నీ లియోన్ పొట్టి డ్రెస్ ని వేసుకొని హాట్ లుక్ లో ఉంది. ఈ మూవీ లో సన్నీ లియోన్ తో పాటు పాయల్ రాజ్ పుత్ కూడా హీరోయిన్ గా నటిస్తోంది. జిన్నా మూవీ లోని పాయల్ రాజ్ పుత్ కి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ ను కూడా ఈ మూవీ బృందం కొంత కాలం క్రితమే విడుదల చేసింది. పాయల్ రాజ్ పుత్మూవీ లో  పచ్చళ్ళ  స్వాతి పాత్రలో కనిపించబోతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: