నందమూరి కళ్యాణ్ రామ్ తాజాగా బింబిసార అనే మూవీ లో హీరోగా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. మంచి అంచనాల నడుమ విడుదలైన ఈ మూవీ విడుదల అయిన మొదటి రోజు మొదటి షో కే బాక్సా ఫీస్ దగ్గర బ్లాక్ బాస్టర్ హిట్ టాక్ ని అందుకుంది. ప్రస్తుతం ఈ మూవీ ప్రపంచ వ్యాప్తంగా అద్భుతమైన కలెక్షన్ లను రాబడుతోంది. ఈ మూవీ విడుదలకు ముందు ఈ మూవీ నుండి చిత్ర బృందం విడుదల చేసిన ప్రచార చిత్రాలు అద్భుతమైన రేంజ్ లో ఉండడంతో సినీ ప్రేమికులు ఈ మూవీ పై మంచి అంచనాలు పెట్టుకున్నారు. అలా సినీ ప్రేమికుల్లో మంచి అంచనాలు ఉన్న కారణంగా ఈ మూవీ కి ప్రపంచ వ్యాప్తంగా 15.60 కోట్ల భారీ ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. 15.20 కోట్ల భారీ ప్రీ రిలీజ్ బిజినెస్ ను ప్రపంచ వ్యాప్తంగా జరుపుకున్న ఈ మూవీ 16.20 కోట్ల భారీ టార్గెట్ తో బాక్సా ఫీస్ బరిలోకి దిగింది. 

మూవీ కి విడుదల అయిన మొదటి రోజు మొదటి షో కే బాక్సా ఫీస్ దగ్గర మంచి టాక్ రావడంతో ఈ సినిమా విడుదల అయిన అతి తక్కువ రోజుల్లోనే బ్రేక్ టార్గెట్ ను పూర్తి చేసుకొని లాభాలను అందుకుంది. ఇప్పటి వరకు 11 రోజుల బాక్స్ ఆఫీస్ రన్ ని కంప్లీట్ చేసుకున్న బింబిసార మూవీ ప్రపంచ వ్యాప్తంగా 31.61 కోట్ల షేర్ , 52.25 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది. ఇప్పటి వరకు బింబిసార మూవీ ప్రపంచ వ్యాప్తంగా 15.41 కోట్ల లాభాలను బాక్సా ఫీస్ దగ్గర అందుకని డబుల్ బ్లాక్ బస్టర్ విజయాన్ని నమోదు చేసుకుంది. ఈ మూవీ కి మల్లాడి వశిష్ట దర్శకత్వం వహించగా,  కేథరిన్, సంయుక్త మీనన్మూవీ లో హీరోయిన్ లుగా నటించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: