యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో నిఖిల్ నటించిన తాజా చిత్రం కార్తికేయ-2 ఈ సినిమాలో హీరోయిన్ గా అనుపమ పరమేశ్వరన్ నటించింది. ఈ చిత్రాన్ని డైరెక్టర్ చందు మొండేటి దర్శకత్వం వహించడం జరిగింది. ఈ సినిమా ఎన్నోసార్లు వాయిదా పడిన ఎట్టకేలకు ఈనెల 13వ తేదీన భారీ స్థాయిలో విడుదలై సక్సెస్ టాక్ తో మంచి బ్లాక్ బాస్టర్ విజయాన్ని అందుకుంది. దేశవ్యాప్తంగా ఈ సినిమా కలెక్షన్స్ ప్రతి రోజుకి పెరుగుతూనే ఉన్నట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం ఇదంతా ఇలా ఉండగా ఈ మూవీతో డైరెక్టర్ చందు మొండేటి మరొకసారి వార్తల్లో నిలవడం గమనార్హం.

మొదట ఈ డైరెక్టర్ తెరకెక్కించిన సవ్యసాచి సినిమా అంతగా ఆశించిన విజయం అందకపోవడంతో డైరెక్టర్గా కాస్త వెనుక పడ్డాడని చెప్పవచ్చు అయితే తాజాగా కార్తికేయ సినిమా ఎక్కించి మంచి విజయాన్ని అందుకున్నాడు. దీంతో ఇప్పుడు డైరెక్టర్ చందు మొండేటి పేరు తెలుగు ఇండస్ట్రీలో బాగా వినిపిస్తున్నది. సూపర్ నాచురల్ మిస్టిక్ క్రియేట్రికల్ గా పెరకెక్కించిన కార్తికేయ సినిమా ప్రతి ఒక్కరిని బాగా విశేషంగా ఆకట్టుకుంటున్నది. అయితే ఇప్పుడు ఈ డైరెక్టర్ తన తదుపరి సినిమా పైన మరింత ఆసక్తి నిలవడం జరుగుతోంది.


సినిమా విడుదలకు ముందే ప్రముఖ గీతా ఆర్ట్స్ బ్యానర్ చెందూతో ఒక సినిమా గురించి అడ్వాన్స్ ఇచ్చి లాక్ చేసుకున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఇక రీసెంట్ గా గని ఫ్లాప్ సినిమా మూట కట్టుకున్న వరుణ్ తేజ్ తో ఈ సినిమాని తెరకెక్కించే అవకాశం ఉన్నట్లుగా సమాచారం. కానీ డైరెక్టర్ చందు మాత్రం తమిళ హీరో కార్తీక్ ఒక సినిమా చేయాలని ఉన్నట్లుగా సమాచారం తనలో కొత్త తరహా సినిమా చేయాలని డైరెక్టర్ అనుకుంటున్నారట. అయితే గీత ఆర్ట్స్ వర్గాలు ఫైనల్ గా ఏ హీరో అని ఇస్తే ఆ హీరో అయితే డైరెక్టర్ చందు మొండేటి సినిమా చేసే అవకాశం ఉంటుంది అని సమాచారం. మరి ఏ హీరో తో సినిమా చేస్తాడో చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి: