మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కొంత కాలం క్రితమే దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన భారీ బడ్జెట్ పాన్ ఇండియా మూవీ ఆర్ ఆర్ ఆర్ తో అద్భుతమైన విజయాన్ని బాక్సా ఫీస్ దగ్గర అందుకొని అద్భుతమైన క్రేజ్ ని ప్రపంచ వ్యాప్తంగా సాధించుకున్న విషయం మనకు తెలిసిందే. ఈ మూవీ లో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో పాటు  జూనియర్ ఎన్టీఆర్ కూడా హీరోగా నటించారు. ఆర్ ఆర్ ఆర్ లాంటి భారీ బ్లాక్ బస్టర్ విజయం తర్వాత మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ పాన్ ఇండియా మూవీ లో హీరోగా నటిస్తున్నాడు. ఈ మూవీ రామ్ చరణ్ కెరియర్ లో 15 వ మూవీ గా తెరకెక్కుతుండడంతో ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ ఆర్ సి 15 అనే వర్కింగ్ టైటిల్ తో జరుగుతుంది.

మూవీ లో కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తుండగా, సునీల్, అంజలిమూవీ లో ఇతర ముఖ్య పాత్రల్లో కనిపించబోతున్నారు. దిల్ రాజు ఈ మూవీ నిర్మిస్తుండగా, ఎస్ ఎస్ తమన్ ఈ సినిమాకు సంగీతాన్ని అందిస్తున్నాడు. ఈ మూవీ లో ప్రతి నాయకుడి పాత్రలో దర్శకుడు మరియు నటుడు అయి నటు వంటి ఎస్ జే సూర్య కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. ఇది ఇలా ఉంటే ఈ క్రేజీ పాన్ ఇండియా మూవీ లో ఒక క్రేజీ బాలీవుడ్ బ్యూటీ కూడా నటించబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. అసలు విషయం లోకి వెళితే ... బాలీవుడ్ ఇండస్ట్రీ లో మంచి క్రేజ్ ఉన్న బ్యూటీ లలో ఒకరు అయినా హుమా ఖురేషి ఈ మూవీ లో నార్త్ పొలిటికల్ లీడర్ పాత్రలో కనిపించబోతున్నట్లు ఒక వార్త వైరల్ అవుతుంది. ఈ వార్త ఎంత వరకు నిజమో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: