త్రివిక్రమ్ దర్శకత్వంలో మహేష్ బాబు హ్యాట్రిక్
సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. అతడు ఖలేజా అనే రెండు సినిమాలను రూపొందించిన ఈ కాంబో ఆ సినిమాల ద్వారా మంచి
సక్సెస్ అందుకోగా ఇప్పుడు హ్యాట్రిక్ విజయంపై వీరిద్దరూ కన్నేశారు. పూజా హెగ్డే
హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకు
తమన్ సంగీతం సమకూరుస్తున్నాడు. రెండో
హీరోయిన్ గా
పెళ్లి సందడి
బ్యూటీ శ్రీ లీల నటించబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. కానీ దీని గురించి ఎలాంటి అధికారిక ప్రకటన ఇప్పటివరకు చిత్ర బృందం చేసింది లేదు.
ఇప్పటికే స్క్రిప్ట్ పనులను పూర్తి చేసుకున్న ఈ
సినిమా యొక్క షూటింగ్ తొందర్లోనే మొదలు కాబోతోంది. ఇందులో మహేష్ బాబును సరికొత్తగా
త్రివిక్రమ్ చూపించబోతున్నాడు అని అంటున్నారు. ఈ
సినిమా తర్వాత మహేష్ బాబు
రాజమౌళి దర్శకత్వంలో
సినిమా చేస్తున్నాడం విశేషం. అయితే ఆ సినిమాను మొదలుపెట్టడానికి కొంత సమయం ఉండడంతో ఈ సినిమాను పూర్తి చేసే విధంగా మహేష్ బాబు ప్రణాళికలు రూపొందించాడు. ఆ విధంగా ఈ సినిమాను వచ్చే ఏడాది వేసవి కల్లా పూర్తి చేసి ఆ తర్వాత
రాజమౌళి దర్శకత్వంలో సినిమాను మొదలు పెట్టాలి అన్నది మహేష్ బాబు ఆలోచన.
అయితే
సినిమా సినిమాకు ఓ కొత్త ప్రయోగాన్ని చేస్తూ దాన్ని ప్రేక్షకులకు నచ్చేలా చేస్తూ
సక్సెస్ అయ్యే
త్రివిక్రమ్ ఈ
సినిమా కోసం కూడా ఓ సరికొత్త ప్రయోగాన్ని చేయబోతున్నాడట. అయితే అది మహేష్ బాబుకు నచ్చకపోయినా కూడా ఆయనను ఒప్పించి మరి ఈ ప్రయోగాన్ని చేస్తున్నాడని అంటున్నారు. మరి ఇది ఏ మాత్రం తేడా కొట్టిన
త్రివిక్రమ్ కెరియర్ కు ఎంతగానో ఇబ్బందికరంగా మారే అవకాశం లేకపోలేదు. మరి ఇలాంటి ప్రయోగాలను ఎన్నో చేసిన ఆయన ఏ విధంగా దీంతో
సక్సెస్ అవుతాడో చూడాలి. అసలు ఆ ప్రయోగం ఏంటి అనేది ఇంకా తెలియ రాలేదు త్వరలోనే ఈ సినిమాలో తాను చేస్తున్న ఆ ప్రయోగం గురించి తెలిపిన చెప్పబోతున్నాడు.