చలో మూవీ తో తెలుగు ప్రేక్షకులను పలకరించిన హీరోయిన్ రష్మిక మందన్న..ఆ సినిమా తో జనాల గుండెల్లో చెరగని ముద్ర వేసుకుంది.అలా ఒక్కో సినిమాతో ఒక్కో క్రేజ్ ను అందుకుంది.ప్రస్తుతం టాలీవుడ్ బ్రేకుల్లేని బండిలా దూసుకెళ్తోంది. మొన్నటివరకు ఒక్క తెలుగు పరిశ్రమకే పరిమితం అయిన ఈ బ్యూటీ హవా..ఇప్పుడు అన్ని ఇండస్ట్రీలకు పాకింది.తమిళం, మళయాళం, బాలీవుడ్‌లోనూ ఈ బ్యూటీ సత్తా చాటుతోంది.రష్మిక ప్రస్తుతం నేషనల్ క్రష్‌గా అవతరించడంతో ఈ అమ్మడుకి సినిమాలు క్యూ కడుతున్నాయి. ఇప్పటికే బాలీవుడ్‌లో పలు సినిమాలకు సైన్ చేసినట్టు తెలుస్తోంది.


రష్మిక మందన్నా ప్రస్తుతం టాప్ హీరోయిన్స్ లిస్టులో తన పేరును లిఖించుకోవడానికి చాలా ఆత్రుతగా ఉన్నట్టు తెలుస్తోంది. అందుకోసమే వరుసబెట్టిసినిమాలు చేస్తోంది.అన్ని భాషల్లోనూ తన మార్క్ చూపిస్తోంది.రీసెంట్ పుష్ప సినిమాతో పాన్ ఇండియా స్టార్ అనిపించుకున్న రష్మిక.. శ్రీవల్లి పాత్రలో లీనమై నటించింది. ప్రస్తుతం ఈ భామ ముంబైలో కనిపిస్తే అందరూ శ్రీవల్లి అని పిలుస్తున్నారట.. అంతగా పుష్ప సినిమా అక్కడి వారికి కనెక్ట్ అయ్యింది. త్వరలోనే దీని సీక్వెల్ రానుంది. దీని కోసం రష్మిక రెమ్యూనరేషన్ భారీగానే డిమాండ్ చేస్తుందట..తొలిభాగంలో రష్మిక అందాలకు యూత్ ఫిదా అయిపోయింది.


నిర్మాతలు కూడా రష్మికకు భారీ మొత్తంలో ముట్టజెప్పేందుకు ఓకే అన్నారట.. ఇక రష్మికకు ఫ్యాన్ ఫాలోయింగ్ క్రమంగా పెరుగుతోంది. ఈ మధ్యే సమంతను కూడా రష్మిక బీట్ చేసిన విషయం తెలిసిందే. తాజాగా రష్మిక నటించిన గుడ్ బై చిత్రం విడుదలకు సిద్ధంగా ఉండగా.. ప్రమోషన్స్‌లో పాల్గొంది రష్మిక..ఈ క్రమంలోనే తన అభిమానికి లైఫ్ లాంగ్ గుర్తుండి పోయే గిఫ్ట్ ఇచ్చింది.ముందుగా అతని బుక్ లో సైన్ చేసిన రష్మిక.. ఆతర్వాత అతని ఛాతి దగ్గర చెరగని ముద్ర వేసింది. దీంతో అతని ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. ఫ్యాన్స్ కూడా రష్మిక తెగ మోసేస్తున్నారు..ప్రస్తుతం పుష్ప 2 షూటింగ్ లో బిజీగా ఉంది.. ఆ సినిమా కూడా హిట్ టాక్ ను అందుకుంటే అమ్మడు క్రేజ్ రెట్టింపు అవుతుంది..మరింత సమాచారం తెలుసుకోండి: