ఐ కాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నేషనల్ క్రష్ రష్మిక మందన హీరోయిన్ గా సుకుమార్ దర్శకత్వంలో పుష్ప ది రైస్ అనే  మూవీ తెరకెక్కిన  విషయం మన అందరికీ తెలిసిందే. భారీ అంచనాల నడుమ పాన్ ఇండియా మూవీ గా పుష్ప ది రైస్ మూవీ తెలుగు తో పాటు తమిళ ,  హిందీ , కన్నడ ,  మలయాళ భాషల్లో పోయిన సంవత్సరం విడుదల అయ్యి  అద్భుతమైన విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకుంది. ఈ మూవీ లో ఫాహాద్ ఫజిల్ విలన్ పాత్రలో నటించగా ,  సునీల్ ,  అనసూయ ఈ మూవీ లో ఇతర ముఖ్యపాత్రలలో నటించారు.

మూవీ కి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించగా ,  టాలీవుడ్ టాప్ హీరోయిన్ లలో ఒకరు అయిన సమంతమూవీ లో స్పెషల్ సాంగ్ లో నటించింది. ఈ స్పెషల్ సాంగ్ లో సమంత తన డ్యాన్స్ తో ,  అంతకుమించిన హాట్ హాట్ అందాలతో కుర్రకారును హిట్ ఎక్కించింది. ఈ సాంగ్ ద్వారా సమంత కు ప్రపంచవ్యాప్తంగా అదిరిపోయే రేంజ్ క్రేజీ లభించింది. ఇలా పుష్ప ది రైస్ మూవీ లో స్పెషల్ సాంగ్ కి అదిరి పోయే క్రేజ్ రావడంతో పుష్ప ది రూల్ మూవీ లో కూడా అదే రేంజ్ లో ఒక స్పెషల్ సాంగ్ పెట్టాలి అని మూవీ యూనిట్ డిసైడ్ అయినట్లు తెలుస్తోంది.

అందులో భాగంగా టాలీవుడ్ ఇండస్ట్రీ లో చాలా సంవత్సరాలు పాటు టాప్ హీరోయిన్ లలో ఒకరిగా కొనసాగిన కాజల్ అగర్వాల్  ని ఈ మూవీ లో స్పెషల్ సాంగ్ కి తీసుకోవాలి అని మూవీ యూనిట్ డిసైడ్ అయినట్లు ఒక వార్త వైరల్ అవుతుంది. ఈ వార్తపై ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.  ఇది వరకే కాజల్ అగర్వాల్ ,  జూనియర్ ఎన్టీఆర్ హీరోగా కొనటాల శివ దర్శకత్వంలో జనతా గ్యారేజ్ మూవీ లో ఐటమ్ సాంగ్ లో నటించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: