ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పోయిన సంవత్సరం పుష్ప ది రైస్ అనే మూవీ లో హీరోగా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సరసన నేషనల్ క్రష్ రష్మిక మందన హీరోయిన్ గా నటించిగా ,  సుకుమార్ ఈ మూవీ కి దర్శకత్వం వహించాడు. ఈ సినిమా పోయిన సంవత్సరం భారీ అంచనాల నడుమ తెలుగు తో పాటు తమిళ ,  కన్నడ , హిందీ ,  మలయాళ భాషల్లో భారీ ఎత్తున విడుదల బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి టాక్ ని తెచ్చుకొని అద్భుతమైన కలెక్షన్ లను కూడా రాబట్టింది. ఇలా ఇప్పటికే పుష్ప ది రైస్ మూవీ పాన్ ఇండియా రేంజ్ లో విడుదలై అద్భుతమైన విజయాన్ని అంతకు మించిన కలెక్షన్ లను సాధించడంతో పుష్ప ది రూల్ మూవీ పై ప్రేక్షకుల్లో  అంచనాలు భారీగా పెరిగిపోయాయి.

మరి కొన్ని రోజుల్లోనే పుష్ప ది రూల్ మూవీ రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కాబోతోంది. ఇది ఇలా ఉంటే తాజాగా పుష్ప ది రూల్ మూవీ కి సంబంధించిన ఒక క్రేజీ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. పుష్ప ది రూల్ మూవీ లో ఒక పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్ర ఉండబోతున్నట్లు ,  ఆ పాత్రలో బాలీవుడ్ ప్రముఖ నటుడు అర్జున్ కపూర్ ని తీసుకోవాలి అన్ ఆలోచనలో పుష్ప ది రూల్ మూవీ మేకర్స్ ఉన్నట్లు ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇప్పటి వరకు ఈ వార్త కు సంబంధించిన ఎలాంటి అధికారిక ప్రకటన నిలబడలేదు. ఇది ఇలా ఉంటే పుష్ప ది రూల్ మూవీ లో ఒక ఐటమ్ సాంగ్ ఉండబోతున్నట్లు దానిలో టాలీవుడ్ ఇండస్ట్రీలో అద్భుతమైన క్రేజ్ ఉన్న హీరోయిన్ లలో ఒకరు అయినా కాజల్ అగర్వాల్ ను తీసుకునే ఆలోచనలో పుష్ప ది రూల్ మూవీ యూనిట్ ఉన్నట్లు కూడా ఒక వార్త వైరల్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: