తేజస్విని అనే అమ్మాయిని దిల్ రాజు 2020 సంవత్సరంలో కొద్ది మంది సమక్షంలో పెళ్లి చేసుకున్న విషయం అందరికీ తెలిసిందే. ఇటీవలే దిల్ రాజు తేజస్విని దంపతులకు ఒక మగ బిడ్డ కూడా జన్మించాడు.
ప్రస్తుతం దిల్ రాజు భార్య మరియు కొడుకుతో లైఫ్ ని చాలా ఆనందంగా గడుపుతున్నాడు. దిల్ రాజు సినిమా లు ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ ప్రేక్షకుల ముందుకు దూసుకు వచ్చేందుకు రెడీ అవుతున్నాయి. ముఖ్యంగా తమిళ సూపర్ స్టార్ విజయ్ నటిస్తున్న వారసుడు మరియు రామ్ చరణ్ హీరోగా శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా లపై భారీ ఎత్తున అంచనాలు ఉన్నాయి మరి.
రెండు సినిమాలు కూడా తప్పకుండా చాలా బాగా ఆకట్టుకుంటాయని నమ్మకం ప్రతి ఒక్కరులో ఉంది. ఇక దిల్ రాజు భార్య తేజస్విని గురించి ప్రత్యేకంగా చెప్పాలి అంటే,, lఆ మధ్య ఈమె ఒక స్టోరీ రైటర్ అంటూ ప్రచారం జరిగింది.
దిల్ రాజు నిర్మిస్తున్న సినిమాల కథల విషయంలో ఈమె నిర్ణయం తీసుకుంటుందని కూడా వార్తలు వచ్చాయి. ఆ విషయం పక్కన పెడితే తాజాగా ఈమె చీర కట్టులో చాలా అందంగా ముస్తాబయి ఇలా ఫోటో షూట్స్ చేయించుకుని, సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది.
హీరోయిన్ కి ఏ మాత్రం తగ్గకుండా తేజస్విని ఉందంటూ కామెంట్స్ చేస్తున్నారు. సినిమాల్లో తేజస్విని క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటిస్తే తప్పకుండా మంచి భవిష్యత్తు ఉంటుందంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు అంటా . ఆయన తేజస్విని కి ఆ అవసరం లేదు, కాకపోతే నటనపై ఆసక్తి ఉంటే ఆమె ప్రయత్నిస్తే తప్పకుండా సక్సెస్ అవుతుందని మరి కొందరు అభిప్రాయం వ్యక్తం అవుతుంది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి