టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో సక్సెస్ లేకపోతే ఎవరైనా మెలమెల్లగా ఫేడ్ అవుట్ అయిపోవాల్సిందే. ముఖ్యంగా హీరోయిన్ లు ఒకటి రెండు సినిమాలతో తమను తాము నిరూపించుకోవాలి లేదంటే వారు ఆదిలోనే తమ కెరియర్ కు పుల్ స్టాప్ పెట్టవలసి ఉంటుంది. అగ్ర హీరోయిన్ లకు కూడా ఎప్పుడు ఎలాంటి పరిస్థితి ఎదురవుతుందో ఎవరు చెప్పలేరు. ఏ సినిమా అయినా ఎంతో జాగ్రత్తగా చూసి చేసుకోవాల్సిందే. ఆ విధంగా హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ ఇప్పుడు తెలుగులో ఒక్క సినిమా చేయకపోవడం దాదాపుగా ఆమెకు ఇక్కడ కెరియర్ క్లోజ్ అయిపోయిందని చెప్పాలి.

వెంకటాద్రి ఎక్స్ప్రెస్ సినిమాతో ప్రేక్షకులకు పరిచయమైన ఈ ముద్దుగుమ్మ పెద్దపెద్ద హీరోలతో నటించి భారీ స్థాయిలో హిట్స్ అందుకుంది. ఆ విధంగా ఈమె బాలీవుడ్ లో సినిమాలు చేయడం మొదలుపెట్టి టాలీవుడ్ చిత్ర పరిశ్రమను పట్టించుకోకపోవడం వల్ల ఆమెకు తెలుగులో సినిమాలు కరువయ్యాయి అని చెప్పవచ్చు. గతంలో చాలామంది హీరోయిన్లు ఈ విధమైన తప్పు చేసినా కూడా వారిని చూసి నేర్చుకోకుండా వీరు కూడా అదే తప్పుచేసి తమ తెలియని చేజేతుల నాశనం చేసుకుంటున్నారు. ఆ విధంగా రకుల్ ప్రీత్ సింగ్ బాలీవుడ్ సినిమా పై మోజుతో టాలీవుడ్ చిత్ర పరిశ్రమ సినిమాలను నిర్లక్ష్యం చేయడంతో ఆమెకు ఇప్పుడు ఇక్కడ కెరియర్ లేకుండా పోయింది అని చెప్పాలి.

మరి త్వరలోనే ఆమె రీ ఎంట్రీ ఇచ్చి క్యారెక్టర్ ఆర్టిస్టుగా రాణిస్తుందా అనేది చూడాలి. ఇప్పటికీ ఆమె సినిమా చేయడానికి చాలా ప్రయత్నాలు చేస్తుంది. పెద్ద హీరో ఆమెతో అవకాశం ఇస్తే తప్ప మళ్ళీ హీరోయిన్ గా సెటిల్ అవ్వదు కాబట్టి ఆమె కోరిక నెరవేరుతుందా అనేది చూడాలి. సోషల్ మీడియాలో ఆమెకు ఫాలోయింగ్ గట్టిగానే ఉందని చెప్పవచ్చు. గ్లామర్ ను అధిక మోతాదులో పంచే టాలీవుడ్ సినిమా హీరోయిన్ లో ఈమె కూడా ఒకరు. 

మరింత సమాచారం తెలుసుకోండి: