అయితే దీనికి భిన్నంగా ‘అన్ ష్టాపబుల్ 2’ షోను బాలకృష్ణ ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో ప్రారంభించడం చాలమందిని ఆశ్చర్య పరుస్తోంది. మరికొందరైతే సినిమా హీరో హోస్ట్ చేసే షోలో రాజకీయవేత్త ఏమిటి అంటూ మరింత షాక్ అవుతున్నారు.
ఇప్పుడు ఆలోటును పూడ్చడానికి కాబోలు బాలయ్య డీజే టిల్లు ఫేమ్ సిద్ధూ జొన్నలగడ్డ యూత్ లో విపరీతమైన క్రేజ్ ఉన్న విశ్వక్ సేన్ లను కలిపి ఒకే ఎపిసోడ్ లో బాలయ్య తన రేంజ్ లో ఇరుకున పెట్టే ప్రశ్నలు వేస్తూ ఆట ఆడుకోవడానికి సిద్ధ పడుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ ఎపిసోడ్ షూటింగ్ త్వరలో జరుగుతుందని తెస్తోంది. అయితే బాలయ్య అభిమానులు మాత్రం ఈవిషయంలో మరొక విధంగా కోరుకుంటున్నారు. ఎప్పటి నుండో బాలయ్య జూనియర్ లు కలిసి ఒక సినిమాలో నటిస్తే చూడాలని ఆశ పడుతున్నారు.
ఆ కోరిక తీరే పరిస్థితి ఇప్పటిలో లేకపోయినప్పటికీ కనీసం బాలయ్య హోస్ట్ చేస్తున్న ఈ అన్ ష్టాపబుల్ షోలో అయినా బాలయ్య జూనియర్ ను ఇంటర్వ్యూ చేసి తనదైన రీతిలో ఒక ఆట ఆడుకుంటే ఆనందపడాలని ఎందరో నందమూరి అభిమానులు ఆశిస్తున్నారు. మరి ఈకోరిక ఎప్పటికి తీరుతుందో తెలియనప్పటికీ సీనియర్ హీరోలతో జరగని పనిని యంగ్ హీరోలతో బాలయ్య జరిపిస్తున్నాడు అనుకోవాలి. తెలుస్తున్న సమాచారంమేరకు ఈషో రాబోతున్న దీపావళి నుండి ప్రారంభం అవుతుందని అంటున్నారు. ఈసారి ఈషోకు ఎలాంటి రేటింగ్స్ వస్తాయో చూడాలి..
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి