టాలీవుడ్
సినిమా పరిశ్రమలో వరుస భారీ విజయాలకు కేరాఫ్ అడ్రస్ గా ఉన్నాడు
కొరటాల శివ. అయితే
మెగాస్టార్ చిరంజీవి హీరోగా ఆయన రూపొం దించిన ఆచార్య
సినిమా ప్రేక్షకులను ఏమాత్రం ఆకట్టుకోకపోవడంతో ఒక్కసారిగా ఆయన డీలా పడిపోయాడని చెప్పాలి. అసలే ఈ
సినిమా ప్రేక్షకులకు నచ్చకపోవడంతో నిరాశ లో ఉన్న
కొరటాల శివకు బయర్స్ నుంచి కూడా అప్పట్లో కొంత ఒత్తిడి రావడం ఎంతగానో బాధపెట్టింది.
ఆర్థిక పరమైన సమస్యల నుంచి వ్యక్తిగతమైన సమస్యల నుంచి బయటకు వచ్చిన
కొరటాల శివ ఇప్పుడు
ఎన్టీఆర్ తో కలిసి
సినిమా చేయ డానికి రంగం సిద్ధం చేసుకున్నారు.
ఎన్టీఆర్ 30 వ సినిమాగా రూపొందుతున్న ఈ సినిమాను తప్పకుండా ప్రేక్షకులందరూ మెచ్చేలా చేసి మంచి కం బ్యాక్ చేయాలనేది
కొరటాల శివ అభిమానుల కోరిక. అయితే ఈ
సినిమా గురించి
కొరటాల శివ ఇప్పటిదాకా నోరు విప్పక పోవడం ఆయన అభిమానులను ఎంతగానో నిరాశ పరుస్తుంది అని చెప్పాలి.
సోషల్ మీడియాలో గత కొన్ని రోజులుగా ఈ
సినిమా ఇంకా మొదలు కాకపోవడం పై రకరకాల ప్రచారాలు జరుగుతున్నాయి.
కొరటాల శివ లో విషయం తగ్గిందని ఈ
సినిమా కోసం ఆయన ఎంతో కష్టపడుతున్నాడు. అసలు ఈ
సినిమా మొదలవుతుందో లేదో అన్న అనుమానాలను చాలా మంది వ్యక్తపరిచారు. ఈ నేపథ్యంలో ఈ సినిమాకు సంబంధించిన అపోహలు తొలగిపోవాలి అంటే తప్పకుండా దర్శకుడు
కొరటాల శివ నోరు విప్పాల్సిందే అని వారు చెబుతున్నారు. ఏదేమైనా
కొరటాల శివ లాంటి
మాస్ చిత్రాలను తెరకక్కించిన దర్శకుడు ఇలాంటి పరిస్థితి రావడం నిజంగా బాధాకరమైన విషయం అనే చెప్పాలి. మరి ఇప్పటికైనా
కొరటాల శివ తన
సినిమా ను అందరికి నచ్చేలా చేసి తనమీద పడ్డ విమర్శలను కు సమాధానం చెబుతాడా అనేది చూడాలి.