తమిళ సినిమా ఇండస్ట్రీ లో అద్భుతమైన క్రేజ్ ఉన్న నటుల్లో ఒకరు అయిన విజయ్ సేతుపతి గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. విజయ సేతుపతి కేవలం తమిళ్ లో మాత్రమే కాకుండా అనేక భాషల మూవీ లలో కూడా నటించి ఎంతో మంది అభిమానుల మనసు దోచుకున్నాడు. ఇది ఇలా ఉంటే ఇప్పటికే విజయ్ సేతుపతి , మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కిన సైరా నరసింహా రెడ్డి అనే భారీ బడ్జెట్ పాన్ ఇండియా మూవీ లో ఒక కీలకమైన పాత్రలో నటించి ప్రేక్షకులను అలరించాడు. అలాగే పంజా వైష్ణవ్ తేజ్ హీరోగా కృతి శెట్టి హీరోయిన్ గా బుచ్చి బాబు సన దర్శకత్వంలో తెరకెక్కిన ఉప్పెన మూవీ లో కృతి శెట్టి తండ్రి పాత్రలో నటించిన విజయ్ సేతుపతి తన నటన తో ప్రేక్షకులను అలరించాడు.

ఉప్పెన మూవీలో విలన్ పాత్రలో నటించిన విజయ్ సేతుపతి తన నటనతో ఉప్పెన మూవీ విజయంలో కీలక పాత్రను పోషించాడు. ఇప్పటికే ఈ సంవత్సరం లోక నాయకుడు కమల్ హాసన్ హీరోగా తెరకెక్కిన విక్రమ్ మూవీ లో విజయ్ సేతుపతి విలన్ పాత్రలో నటించి దేశవ్యాప్తంగా ప్రేక్షకులను అలరించాడు. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం విజయ్ సేతుపతి ,  షారుఖ్ ఖాన్ హీరోగా అట్లీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న జావాన్ మూవీ లో కీలకపాత్రలో నటిస్తున్నాడు.

అలాగే సందీప్ కిషన్ హీరోగా తెరకెక్కుతున్న మైఖేల్ మూవీ లో కూడా ఒక ముఖ్యమైన పాత్రలో నటిస్తున్నాడు. ఇలా వరుస మూవీ లతో ఫుల్ జోష్ లో ఉన్న విజయ్ సేతుపతి ,  మమ్ముట్టి హీరోగా తేరక్కపోయే మూవీలో కూడా నటించబోతున్నట్లు తెలుస్తోంది. ఈ మూవీ కి మణికంఠన్ దర్శకత్వం వహించబోతున్నాడు. మమ్ముట్టి హీరోగా తేరకేక్కబోయే మూవీ లో విజయ్ సేతుపతి విలన్ పాత్రలో కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా మరికొన్ని రోజుల్లోనే రాబోతున్నట్లు సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: