సినిమా ఇండస్ట్రీ లోకి ఎంతో మంది ముద్దుగుమ్మలు ప్రతి సంవత్సరం ఎంట్రీ ఇస్తూ ఉంటారు. కానీ వారిలో కొంత మంది మాత్రమే సినిమా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చిన అతి తక్కువ కాలంలోనే అద్భుతమైన క్రేజ్ ను సంపాదించుకుంటూ ఉంటారు. అలాంటి వారిలో ఫరియా అబ్దుల్లా ఒకరు. ఈ ముద్దుగుమ్మ జాతి రత్నాలు మూవీ తో తెలుగు సినిమా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చింది. 

ఫరియా అబ్దుల్లా సినిమా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చిన మొట్ట మొదటి మూవీ తోనే అద్భుతమైన క్రేజ్ ను ,  అద్భుతమైన విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకుంది. ఇది ఇలా ఉంటే ఫరియా అబ్దుల్లా ఈ సంవత్సరం సంక్రాంతి కానుకగా విడుదల అయిన బంగార్రాజు మూవీ లో ఒక ఐటమ్ సాంగ్ లో నటించింది. ఈ ఐటెం సాంగ్ ద్వారా ఈ ముద్దు గుమ్మ క్రేజ్ మరింత పెరిగింది. 

తాజాగా ఫరియా అబ్దుల్లా "లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్" మూవీ లో హీరోయిన్ గా నటించింది. ఈ మూవీ ప్రస్తుతం థియేటర్ లలో విజయవంతంగా ప్రదర్శించబడుతుంది. ఫరియా అబ్దుల్లా ప్రస్తుతం మాస్ మహారాజ రవితేజ హీరోగా తేరకెక్కుతున్న రావణాసుర మూవీ లో ఒక ముఖ్యమైన పాత్రలో నటిస్తోంది. ఇలా ప్రస్తుతం వరస క్రేజీ మూవీ ల అవకాశాలతో ఫుల్ జోష్ లో కెరియర్ ను ముందుకు తీసుకు వెళుతున్న ఈ ముద్దుగుమ్మ ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటూ , తన ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేస్తూ వస్తుంది. 

అందులో భాగంగా తాజాగా ఫరియా అబ్దుల్లా తన ఇన్స్టా లో కొన్ని ఫోటోలను పోస్ట్ చేసింది. ఈ ఫోటోలలో ఈ ముద్దుగుమ్మ అదిరిపోయే లుక్ లో ఉన్న శారీని కట్టుకొని , అందుకు తగిన స్లీవ్ లెస్ బ్లౌజ్ ను ధరించి , డిఫరెంట్ డిఫరెంట్ యాంగిల్స్ లో ఫోటోలకు ఫోజులు ఇచ్చింది. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: