తమిళ స్టార్ హీరో ధనుష్ ప్రస్తుతం తెలుగు ఇండస్ట్రీ పై ఫుల్ ఫోకస్ పెట్టాడు. అందుకే వరుసగా తెలుగు దర్శకులను లైన్ లో బాగా పెడుతున్నాడు. తెలుగు లవ్ స్టోరీ స్పెషలిస్ట్స్ శేఖర్ కమ్ముల ఇంకా అలాగే వెంకీ అట్లూరి హీరో ధనుష్ తో సినిమాకు సైన్ చేయగా, ఇందులో వెంకీ అట్లూరి మూవీ దాదాపు షూటింగ్ ని చేసేసుకుంది. బైలింగ్వల్  సినిమాగా వస్తున్న ఈ సినిమాకు 'సార్' అనే టైటిల్ ని కంఫర్మ్ చేశారు.ఇటీవల విడుదల చేసిన టీజర్ అండ్ ఫస్ట్ సాంగ్ ఆడియన్స్ ని ఆకట్టుకుంటున్నాయి.'మాస్టారు మాస్టారు' అంటూ సాగే ఫస్ట్ పాటకు మంచి స్పందన లభించింది. ఇప్పటికీ ఆ సాంగ్ యూట్యూబ్ లో 9వ ప్లేస్ లో ట్రెండ్ అవుతుంది.హీరో ధనుష్ తన కెరీర్ లో మొదటిసారి పాఠాలు చెప్పే టీచర్ పాత్రలో కనిపిస్తున్నాడు. మలయాళం బ్యూటీ సంయుక్త మీనన్ ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది. కాగా మొదట ఈ సినిమాని డిసెంబర్ 2న విడుదల చేస్తామని ప్రకటించగా, తాజాగా ఈ సినిమా రిలీజ్ ని వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకున్నారు నిర్మాతలు.


2023 ఫిబ్రవరి 17 వ తేదీన సినిమా విడుదల చేస్తున్నట్లు కొత్త పోస్టర్ ని అధికారికంగా విడుదల చేసింది సినిమా యూనిట్.టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ సూర్యదేవర నాగవంశీ ఇంకా ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ తో కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా ధనుష్ కు మొదటి స్ట్రెయిట్ తెలుగు ఫిల్మ్. ఇక టీజర్ బట్టి చూస్తే.. చదువుని వ్యాపారం చేసి అమ్ముతున్న సమాజాన్ని ప్రశ్నించేలా ఈ మూవీ కథ ఉండబోతున్నట్లు సమాచారం తెలుస్తుంది. మరి ఈ మూవీ ధనుష్ కి టాలీవుడ్ లో మొదటి విజయాన్ని అందించగలదో లేదో చూడాలి.నిజానికి ఫిబ్రవరి అన్ సీజన్ అయినప్పటికీ 'సితార ఎంటర్టైన్మెంట్స్' బ్యానర్లో రూపొందిన 'భీష్మ' 'డీజే టిల్లు' 'భీమ్లా నాయక్' వంటి సినిమాలు ఫిబ్రవరి నెలలోనే విడుదల అయ్యి హిట్ అయ్యాయి.ఆ సెంటిమెంట్ తో 'సార్' సినిమాను కూడా ఫిబ్రవరిలోనే విడుదల చేయబోతున్నట్టు స్పష్టమవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: