మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఇప్పటికే ఈ సంవత్సరం ఆర్ ఆర్ ఆర్ అనే భారీ బడ్జెట్ పాన్ ఇండియా మూవీ తో అద్భుతమైన విజయాన్ని మరియు అద్భుతమైన క్రేజీ ను ప్రపంచవ్యాప్తంగా సంపాదించుకున్నాడు. ఆర్ ఆర్ ఆర్ మూవీ విజయంతో ఫుల్ జోష్ లో ఉన్న మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం దేశం గర్వించదగ్గ గొప్ప దర్శకులలో ఒకరు అయినటు వంటి శంకర్ దర్శకత్వం లో తెరకెక్కుతున్న మూవీ లో హీరో గా నటిస్తున్నాడు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ న్యూజిలాండ్ లో జరుగుతుంది. ఈ మూవీ లో కీయరా అద్వానీ హీరోయిన్ గా నటిస్తూ ఉండగా , అంజలి , సునీల్మూవీ లో ఇతర ముఖ్య పాత్రలలో కనిపించబోతున్నారు.

ఎస్ జే సూర్యమూవీ లో విలన్ పాత్రలో కనిపించనున్నాడు. తమన్మూవీ కి సంగీతం అందిస్తున్నాడు. ఇది ఇలా ఉంటే రామ్ చరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వం లో తెరకెక్కుతున్న మూవీ లో నటిస్తూ ఉండగానే , తన తదుపరి మూవీ ని కూడా సెట్ చేసుకున్నట్లు తెలుస్తోంది. రామ్ చరణ్ తన తదుపరి మూవీ ని బుచ్చిబాబు సన దర్శకత్వం లో చేయబోతున్నట్లు తెలుస్తోంది. దాదాపు ఈ కాంబినేషన్ లో మూవీ కన్ఫామ్ అయినట్లు సమాచారం. మరి కొద్ది రోజుల్లోనే ఈ కాంబినేషన్ మూవీ కి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా రాబోతున్నట్లు తెలుస్తోంది.

మూవీ రామ్ చరణ్ కెరియర్ లో 16 వ మూవీ గా రూపొందబోతుంది. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం రామ్ చరణ్ , బుచ్చిబాబు సన కాంబినేషన్ లో తెరకెక్కబోయే మూవీ కి సంబంధించిన ఒక కేజీ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. రామ్ చరణ్ తో బుచ్చిబాబు స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో ఒక మూవీ ని చేయనున్నట్లు , ఈ సినిమా షూటింగ్ వచ్చే సంవత్సరం సంక్రాంతి తర్వాత ప్రారంభం కాబోతున్నట్లు ఒక వార్త వైరల్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: