టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకున్న సమంత గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. కేవలం టాలీవుడ్ లోనే కాకుండా సౌత్ సినీ ఇండస్ట్రీలో నయనతార తర్వాత మంచి పాపులారిటీ సంపాదించుకున్న ఈమె.. అటు బాలీవుడ్ లో కూడా పలు వెబ్ సిరీస్ ల ద్వారా మరింత ఫాలోయింగ్ సొంతం చేసుకుంది. ఇటీవల అక్కడ కూడా వరుస సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ పాన్ ఇండియా హీరోయిన్గా చలామణి అయ్యే ప్రయత్నం చేస్తుంది. ఈ క్రమంలోనే హాలీవుడ్ చిత్రాలకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇస్తుంది సమంత.

ఇకపోతే ప్రస్తుతం ఈమె నటించిన తెలుగు పాన్ ఇండియా చిత్రం యశోద.. థియేటర్లలో విడుదల అయ్యి మొదటి రెండు రోజులు మంచి పాజిటివ్ టాక్ తెచ్చుకున్నప్పటికీ.. ఆ తర్వాత మిశ్రమ స్పందన పొందుతోంది. దీన్ని బట్టి చూస్తే కలెక్షన్స్ కూడా పెద్దగా రాబట్ట లేకపోతోందని చెప్పవచ్చు. లేడీ ఓరియంటెడ్ చిత్రంగా సరోగసి నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని కొత్త దర్శకుడు హరి హరీష్ దర్శకత్వంలో కృష్ణలెంక శివప్రసాద్ ఈ సినిమాను నిర్మించారు. అయితే త్వరలోనే ఈ సినిమా రెండు మూడు భాగాలు కూడా విడుదల చేస్తామని దర్శక నిర్మాతలు ప్రకటించిన విషయం తెలిసిందే.

కానీ తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. ఈ సినిమా కలెక్షన్స్ ఘోరంగా పడిపోతున్నాయని చెప్పాలి. మిలియన్ డాలర్ క్లబ్‌లో చేరదు అని కేవలం   $750K ముగింపు కలెక్షన్లతో  మాత్రమే సినిమా ముగిసే అవకాశం ఉంది అని సమాచారం.. మరోపక్క డిసెంబర్ రెండవ వారం నుంచి అమెజాన్ ప్రైమ్ ఓటీటీ లో ప్రసారం కానుందని వెల్లడించారు.  కానీ ఈ సినిమాలో చూపించిన ఎవా హాస్పిటల్ పేరును తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశారని ఈ సినిమా ఓటిటి విడుదల అడ్డుకోవడానికి కోర్టులో కేఫ్ ఫైల్ చేయించారు యాజమాన్యం. దీంతో సమంతా కి కొత్త కష్టాలు తెచ్చి పెట్టింది ఈ సినిమా..  మరి ఈ సినిమా ఓటిటి విడుదలపై చిత్ర బృందం ఎటువంటి క్లారిటీ ఇస్తుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: