‘బాహుబలి’ ‘ఆర్ ఆర్ ఆర్’ సినిమాల కలక్షన్స్ గురించి తెలుగువారు చాలగొప్పగా చెప్పుకుంటారు. ఇండియాలో ఒక సినిమా 1000 కోట్ల కలక్షన్స్ దాటితే అది బ్లాక్ బష్టర్ హిట్ కింద లెక్క. అయితే ఒక ఇంగ్లీష్ సినిమా డబ్బింగ్ ను తెలుగులో విడుదల చేయడానికి 80 కోట్లు పెట్టి కొనడం ఒక రికార్డు అయితే ఇప్పుడు ఆసినిమా మన తెలుగు రాష్ట్రాలలో 200 కోట్ల కలక్షన్స్ వసూలు చేస్తుందని వస్తున్న అంచనాలు విని ఇండస్ట్రీ వర్గాలు ఆశ్చర్య పడుతున్నాయి.


హాలీవుడ్ ఇండస్ట్రీ అంచనాల ప్రకారం ఈ మూవీ ప్రపంచ వ్యాప్తంగా 16 వేల కోట్లు వసూలు చేస్తుందని అప్పటికి ఆసినిమా బ్రేక్ఈవెన్ మాత్రమే వస్తున్న అంచనాలు విని ఇండస్ట్రీ వర్గాలు షాక్ అవుతున్నాయి. దీనికి తగ్గట్టుగానే ఈసినిమా పట్ల విదేశాలలో మాత్రమే కాకుండా మన తెలుగు రాష్ట్రాలలో కూడ విపరీతమైన మ్యానియా పెరిగి పోయింది. ఈమూవీ మన తెలుగు రాష్ట్రాలలో కేవలం 10 రోజులలోనే 200 కోట్లు వసూలు చేయడం ఖాయం అన్న అంచనాలు వినిపిస్తున్నాయి.  


ఈసినిమాకు సంబంధించి అప్పుడే దేశవ్యాప్తంగా అనేక చోట్ల అడ్వాన్స్ బుకింగ్ టిక్కెట్స్ బుక్ మై షో యాప్ ద్వారా అమ్మకాలు మొదలైతే అవి హాట్ కేక్ లా అమ్మకం అవుతోంది. ప్రస్తుతం తెలుగు ప్రజలకు ఈ మూవీ టిక్కెట్లు సంపాదించడం శక్తిమించిన పనిలా మారిపోయింది అన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఈసినిమాకు సంబంధించి ఇప్పటికే రిలీజ్ చేసిన ట్రైలర్లు ఒకదాన్ని మించి ఒకటిగా ఉండటంతో ఈ మ్యానియా ఏర్పడింది.  


మామూలుగా ఎంత పెద్ద హీరోల సినిమాలైనా వారం పదిరోజుల ముందే బుకింగ్స్ ఓపెన్ అవుతుంటాయి. కానీ ‘అవతార్ 2’కు మాత్రం మూడు వారాల ముందే బుకింగ్స్ ఓపెన్ అవ్వడం షాకింగ్ గా మారింది. హైదరాబాద్‌ లో కూడ రెండు మల్టీప్లెక్సుల్లో వీకెండ్ మొత్తానికి టికెట్లు సోల్డ్ ఔట్ అయిపోవడం విశేషం. ఈ దూకుడు చూస్తుంటే ఇండియన్ బాక్సాఫీస్‌ ను ‘అవతార్ 2’ షేక్ చేయడం ఖాయం అంటూ అంచనాలు ఉన్నాయి..



మరింత సమాచారం తెలుసుకోండి: