18 పేజెస్.. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్ సినిమాపై మరింత క్యూరియాసిటీని పెంచేసాయి. ముఖ్యంగా ఈ సినిమాలో విభిన్నమైన పాత్రలో నిఖిల్ కనిపించబోతున్నాడు . ఇందులో హీరోయిన్గా అనుపమ పరమేశ్వరన్ నటిస్తోంది.  ప్రస్తుతం కార్తికేయ 2 సినిమాతో భారీ విజయాన్ని సొంతం చేసుకున్న నిఖిల్.. ఇప్పుడు కార్తికేయ 3 సినిమాతో కూడా త్వరలోనే మన ముందుకు రాబోతున్నారు. కార్తికేయ 2 సినిమాలో అనుపమ పరమేశ్వరన్ సరసన జోడి కట్టి మంచి బ్లాక్ బాస్టర్ విజయాన్ని సొంతం చేసుకున్న నిఖిల్.. ఇప్పుడు 18 పేజీస్ చిత్రంలో కూడా ఆమెతోనే జతకట్టాడు. ఇప్పటికే పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తిచేసుకుని విడుదలకు సిద్ధంగా ఉన్న ఈ సినిమా ప్రమోషన్స్ జరుపుకుంటోంది.


పల్నాటి సూర్య ప్రతాప్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్లు మరింత క్యూరియాసిటీని పెంచేస్తున్నాయి. సెప్టెంబర్ 10వ తేదీన ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని ఎన్నో ప్రయత్నాలు చేశారు.  కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల కార్తికేయ 2  సినిమాను ముందుగా విడుదల చేసి ఈ సినిమాను ఇప్పుడు డిసెంబర్ 23 కి వాయిదా వేశారు. అయితే ఈ సినిమా విడుదలకు కేవలం 20 రోజులు మాత్రమే మిగిలి ఉన్న నేపథ్యంలో చిత్ర బృందం ప్రమోషన్స్ చేపడుతున్న నేపథ్యంలో నిఖిల్ మాత్రం ప్రమోషన్స్ కి రాకుండా తప్పించుకుంటున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

అల్లు అరవింద్ సమర్పణలో గీత ఆర్ట్స్ 2  బ్యానర్ల పై బన్నీ వాసు నిర్మిస్తున్న ఈ చిత్రానికి స్టార్ డైరెక్టర్ సుకుమార్ కథనందించారు. అయితే ఇంత భారీ అంచనాల మధ్య విడుదల కాబోతున్న ఈ సినిమా ప్రమోషన్స్ లో నిఖిల్ ఎందుకు పాల్గొనడం లేదు అనేది ప్రస్తుతం ప్రశ్నార్థకంగా మారింది.. ఇతర సినిమా ప్రాజెక్టులలో ఏమైనా బిజీగా ఉన్నాడా? లేక మరేదైనా కారణం ఉందా ? అనేది తెలియాల్సి ఉంది.. మొత్తానికైతే కార్తికేయ 2 సినిమాతో విజయాన్ని అందుకున్న ఈ జోడి ఇప్పుడు ఈ సినిమాతో ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: