ప్రతి సంవత్సరం ఎంతో మంది ముద్దు గుమ్మలు సినిమా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇస్తూ ఉంటారు. కానీ వారిలో కొంత మంది మాత్రమే నటించిన మొదటి మూవీ తోనే నటన తోను , అంద చందాల తోనూ ప్రేక్షకులను ఆకట్టుకుంటూ ఉంటారు. అలాంటి వారిలో పొడుగు కాళ్ళ సుందరి ఫారియ అబ్దుల్లా ఒకరు . ఈ ముద్దు గుమ్మ జాతి రత్నాలు మూవీ తో తెలుగు సినిమా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చి , తన నటనతో , అంద చందాలతో ప్రేక్షకులను ఆకట్టుకుంది . 

ఆ తర్వాత ఈ ముద్దు గుమ్మ తెలుగు సినిమా ఇండస్ట్రీ లో పర్వాలేదు అనే రేంజ్ సినిమాలలో అవకాశాలను దక్కించు కోని కెరియర్ ను ఫుల్ జోష్ లో ముందుకు సాగిస్తుంది. ఇప్పటికే ఈ ముద్దు గుమ్మ హీరోయిన్ పాత్రలు మాత్రమే కాకుండా బంగార్రాజు మూవీ లో ఐటమ్ సాంగ్ లో కూడా నటించి ప్రేక్షకులను అలరించింది . తాజాగా లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మూ వీలో హీరోయిన్ గా ఫరియా నటించింది . ప్రస్తుతం రావణాసుర అనే మూ వీలో ముద్దుగుమ్మ నటిస్తోంది. రవితేజమూవీ లో హీరోగా నటిస్తున్నాడు . 

ఇది ఇలా ఉంటే సోషల్ మీడియాలో కూడా ఫరియా ఈ మధ్య చాలా యాక్టివ్ గా ఉంటూ వస్తుంది. అందులో భాగంగా తాజాగా కూడా తనకు సంబంధించిన కొన్ని ఫోటోలను ఈ ముద్దు గుమ్మ తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది. తాజాగా ఫరియా తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసిన ఫోటోలలో పొట్టి డ్రెస్ ను వేసుకొని క్యూట్ స్మైల్ తో ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది. ప్రస్తుతం ఫరియా కు సంబంధించిన ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: