టాలీవుడ్ స్టార్ హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి ఎంత చెప్పినా తక్కువే. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కోసం అయినా అభిమానులు వేయికళ్లతో ఎదురు చూస్తూ ఉంటారు. అంతేకాదు ఒక్కసారి పవన్ ని చూస్తే చాలు అని ఎంతోమంది తన అభిమానులు ఎంతో కాలంగా ఎదురుచూస్తూ ఉన్నారు. గత కొంతకాలంగా సినిమాలకు చిన్న గ్యాప్ ఇచ్చాడు పవన్ కళ్యాణ్. ప్రస్తుతం వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉన్నాడు. వకీల్ సాబ్, భీమ్లా నాయక్ వంటి సినిమాలతో అలరించిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నాడు. ప్రస్తుతం క్రిష్ దర్శకత్వంలో హరిహర వీరమల్లు సినిమాలో నటిస్తూ బిజీగా ఉన్నాడు పవన్ కళ్యాణ్. 

ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ చివరి దశలో ఉంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న ఈ సినిమా పిరియాడికల్ డ్రామాగా తెరకెక్కనుంది. ఈ సినిమానే కాకుండా పవన్ తాజాగా సుజిత్ దర్శకత్వంలో మరో ప్రాజెక్ట్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి మనందరికీ తెలిసిందే. సాహో సినిమాతో ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ డైరెక్టర్ ఇప్పుడు పవన్ తో సినిమా ప్రకటించడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే తాజాగా నిన్న హైదరాబాదులో పవన్ కళ్యాణ్ మరియు సుజిత్ ప్రాజెక్టుకి సంబంధించిన ప్రారంభోత్సవం చాలా గ్రాండ్ గా జరిగింది. ఇక ఈ కార్యక్రమానికి తమన్ కూడా హాజరయ్యారు. దీంతో ఈ సినిమా మ్యూజిక్ డైరెక్టర్ తమన్ అని తెలుస్తోంది.

వీటితోపాటు ఈ కార్యక్రమానికి అల్లు అరవింద్, దిల్ రాజు, సురేష్ బాబు సైతం హాజరవడం జరిగింది. ఇక ఈ కార్యక్రమానికి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బ్లాక్ కలర్ డ్రెస్ లో చాలా స్టైలిష్ గా నడుచుకుంటూ వచ్చి అందరినీ ఆకట్టుకున్నాడు. ఇదిలా ఉంటే ఇక ఈ కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ పెట్టుకున్న వాచ్ సోషల్ మీడియా వేదికగా హాట్ టాపిక్ గా మారింది. ఇందులో భాగంగానే పవన్ కళ్యాణ్ పెట్టుకున్న వాచ్ ధర ఎంత అని ఆరా తీస్తున్నారు పవన్ అభిమానులు. ఇక పవన్ పెట్టుకున్న ఆ వాచ్ ధర ఎంతో తెలిస్తే ఖచ్చితంగా షాక్ అవుతారు. పవన్ కళ్యాణ్ పెట్టుకున్న ఈ వాచ్ పనేరాయ్ అనే బ్రాండ్ కి చెందిందని తెలుస్తోంది. అంతేకాదు ఈ వాచ్ ధర అక్షరాల 13.52 లక్షలు అని తెలుస్తోంది. పవన్ అభిమానులు ఈ వాచ్ ధరణి గూగుల్ లో సెర్చ్ చేయగా దీని ధర చూసి షాక్ అవుతున్నారు..!!

మరింత సమాచారం తెలుసుకోండి: