కళామ్మ తల్లి ముద్దుబిడ్డ విశ్వనాథ్‌ రికార్డులు, అవార్డులు అందుకొని తెలుగు సినిమా పరిశ్రమకి గర్వకారణం అయ్యారు. తెలుగు సినిమాలకు ప్రపంచవ్యాప్తంగా గొప్ప గుర్తింపు తెచ్చిన దర్శకుడు కె. విశ్వనాథ్‌ గారు. ఏకంగా ఆరు ప్రపంచ రికార్డులను ఆయన సొంతం చేసుకున్నారు.ఇక నోబెల్‌ వరల్డ్‌ రికార్డు, ఫిలిం వరల్డ్‌ రికార్డు, ఆస్కార్‌ బుక్‌ ఆఫ్‌ వరల్డ్‌ రికార్డు, బయోగ్రఫీ బుక్‌ ఆఫ్‌ వరల్డ్‌ రికార్డు ఇంకా అలాగే భారత్‌ వరల్డ్‌ రికార్డు, టాలెంట్‌ బుక్‌ ఆఫ్‌ వరల్డ్‌ రికార్డుల్లో ఆయన పేరు నమోదు చేసినట్లు ప్రపంచ రికార్డుల భారత ప్రతినిధి కెవి రమణారావు గతంలో తెలిపారు. ఈ రికార్డుల ధృవపత్రాల్ని వారు స్వయంగా విశ్వనాథ్‌ ఇంటికెళ్లి  మరీ ఆయనకు అందజేశారు.ఇక ఆయన తీసిన 'శంకరాభరణం', 'సప్తపది', 'స్వాతిముత్యం', 'సూత్రధారులు', 'స్వరాభిషేకం' వంటి సినిమాలకు గాను ఐదు జాతీయ అవార్డులను ఆయన అందుకున్నారు. ఇంకా అంతేగాక బాలీవుడ్‌లో ప్రతిష్టాత్మక ఫిలింఫేర్‌ సౌత్‌ అవార్డుల్ని కూడా ఆయన అందుకున్నారు.


1980లో జాతీయ ఉత్తమ కుటుంబకథా చిత్రంగా శంకరాభరణం నిలిచింది.1982లో నర్గీస్ దత్ జాతీయ సమైక్యతా ఉత్తమచిత్రంగా సప్తపది నిలిచింది.1984లో జాతీయ ఉత్తమ చలనచిత్రంగా తెలుగు సాగరసంగమం నిలిచింది.1986లో జాతీయ ఉత్తమ చలనచిత్రంగా తెలుగు స్వాతిముత్యం సినిమా నిలిచింది.1988లో జాతీయ ఉత్తమ చలనచిత్రంగా తెలుగు శృతిలయలు నిలిచింది.2004 లో జాతీయ ఉత్తమ చలనచిత్రంగా తెలుగు స్వరాభిషేకం నిలిచింది.కేవలం దర్శకుడిగానే కాకుండా నటుడిగా కూడా తన ప్రతిభ ఏంటో ఆయన చూపించారు. తాత, తండ్రి పాత్రల్లో చాలా సినిమాల్లో చాలా అద్భుతంగా నటించారు. శుభసంకల్పం సినిమాతో తొలిసారి వెండితెరపై కనిపించిన కె.విశ్వనాథ్‌ గారు వజ్రం, కలిసుందాం రా, నరసింహనాయుడు, సీమ సింహం, నువ్వు లేక నేను లేను, సంతోషం, లాహిరి లాహిరి లాహిరిలో ఇంకా అలాగే ఠాగూర్‌ వంటి సినిమాల్లో మంచి పాత్రలతో మెప్పించారు.ఆయన ఒక లెజెండరీ దర్శకుడు, కళామ్మ తల్లి ముద్దుబిడ్డలలో ఒకరు.

మరింత సమాచారం తెలుసుకోండి: