మెగా స్టార్ చిరంజీవి వారసుడుగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన రామ్ చరణ్ తన తండ్రి అంచనాలకు అనుగుణంగా కెరియర్ లో ఎదగడమే కాకుండా ఏకంగా అతడి పేరు హాలీవుడ్ మీడియాకు కూడ తెలిసే స్థాయికి ‘ఆర్ ఆర్ ఆర్’ తో ఎదిగిపోయాడు. ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో ఒక భారీ సినిమాను చేస్తున్న రామ్ చరణ్ ఆమూవీ తరువాత తాను చేయవలసిన సినిమాల విషయమై ఇప్పటి నుండే తన అన్వేషణ మొదలుపెట్టాడు.


వాస్తవానికి చరణ్ అంగీకరిస్తే అతడితో ‘రంగస్థలం 2’ తీయడానికి సుకుమార్ రెడీ ఉన్న విషయం తెలిసిందే. అలాగే కన్నడ డైరెక్టర్ నర్తన్ కూడ ఒక కథను చరణ్ కు వినిపించి అతడి అంగీకారం కోసం ఎదురు చూస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. దీనితో కన్ఫ్యూజన్ లో ఉన్న రామ్ చరణ్ పరిస్థితిని గ్రహించి చిరంజీవి రంగంలోకి దిగినట్లు తెలుస్తోంది.


అంతేకాదు చరణ్ కు ‘ఆర్ ఆర్ ఆర్’ మూవీతో ఏర్పడిన పాన్ ఇండియా ఇమేజ్ మరింత కొనసాగించే విధంగా చిరంజీవి మరన్ని వ్యూహాలు రచిస్తూ మెగా స్టార్ తన కొడుకు కోసం కొత్త కథల అన్వేషణలో ఉన్నట్లు టాక్. దీనితో చిరంజీవి దగ్గరకు అతడికి కథలు చెప్పి అతడిని ఒప్పించాలి అని ప్రయత్నిస్తూ అతడి దగ్గరకు వస్తున్న యంగ్ డైరెక్టర్స్ తో చరణ్ ను దృష్టిలో పెట్టుకుని ఏదైనా ఒక మంచి కథను వ్రాయ వచ్చుకదా అంటూ చిరంజీవి ఆ దర్శకులను అడుగుతున్నట్లు టాక్.

లేటెస్ట్ గా పూరీ జగన్నాథ్ చిరంజీవిని కలిసి ఒక కథ చెప్పినప్పుడు ఆకథ అంతా విన్న తరువాత తన నిర్ణయం చెప్పకుండా చరణ్ కు కూడా ఒక కథ ఉంటే చెప్పమని అడిగినట్లు తెలుస్తోంది. అంతేకాదు చిరంజీవి తనను కలిసిన హరీష్ శంకర్ నక్కిన త్రినాధ్ రావ్ రచయిత ప్రసన్న లతో కూడ ఇలాగే చరణ్ కోసం కథలు వ్రాయమని వారిని ప్రోత్సహిస్తున్నట్లు తెలుస్తోంది..


మరింత సమాచారం తెలుసుకోండి: