తమిళ హీరోలు వున్నారే. వీరికి తెలుగు మార్కెట్‌ కావాలి. కానీ సినిమా ప్రమోషన్స్ కోసం తెలుగు ప్రేక్షకులను పలకరించేందుకు మాత్రం అస్సలు రారు. ఇంకా తెలుగు ఆడియెన్స్ కోసం సరిగ్గా ఈవెంట్లు కూడా పెట్టరు.పెట్టినా కూడా ఆ హీరోలు రారు. అయితే ఈ విషయంలో రజినీ కాంత్ , కమల్ హాసన్‌ చాలా బెటర్ అనే చెప్పాలి. ఎందుకంటే వాళ్లు తెలుగు ప్రేక్షకులను ఎప్పుడు కూడా చాలా ప్రత్యేకంగా చూస్తారు. తెలుగు మీడియాతో ఇంకా ప్రేక్షకులతో వారు ఎక్కువగా ఇంటరాక్ట్ అవుతారు. ఆ తరువాత సూర్య,కార్తీలు  కూడా తెలుగు వారితో ముచ్చటిస్తుంటారు.కానీ విజయ్, అజిత్  మాత్రం అస్సలు రారు.వాళ్ళు సరిగ్గా వాళ్ళ తమిళ సినిమా ఈవెంట్లకే అటెండ్ ఎవ్వరు.విజయ్ అయితే సినిమా మొత్తానికి కలిసి కేవలం ఒక ఈవెంట్‌లో మాత్రమే పాల్గొంటాడు. అజిత్ అయితే అసలు ఆ పని కూడా చేయడు.అజిత్ ఏ సినిమాకి ప్రమోషన్స్ చెయ్యడు. ఇక విజయ్ తన వారిసు సినిమా కోసం ఆడియో లాంచ్ ఈవెంట్ పెట్టాడు.అయితే వారిసు సినిమా తెలుగులో కాస్త ఆలస్యంగానే వచ్చింది.


ఈ సినిమాని మన తెలుగు దర్శకుడు ఇంకా తెలుగు నిర్మాత దిల్ రాజు తీసిన కూడా తెలుగులో ప్రమోట్ చేసేందుకు విజయ్ రాలేదంటే అర్ధం చేసుకోవాలి.కానీ యంగ్ హీరో ధనుష్‌ మాత్రం తన సినిమాను తెలుగులో చాలా చక్కగా ప్రమోట్ చేసుకుంటున్నాడు. సితార ఎంటర్టైన్మెంట్ వారు నిర్మిస్తున్న సార్ (వాతి) మూవీని యంగ్ డైరెక్టర్ వెంకీ అట్లూరి తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమాను ఫిబ్రవరి 17 వ తేదీన రిలీజ్ చేస్తున్నారు. ఈ క్రమంలో రేపు ఈ మూవీ ట్రైలర్‌ను రిలీజ్ చేయబోతోన్నారు. ఈ మూవీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో హీరో ధనుష్‌ సందడి చేయబోతోన్నాడు. ఇలా తెలుగు రాష్ట్రాల్లో తన సినిమాను ప్రమోట్ చేసుకునేందుకు స్వయంగా తానే రంగంలోకి దిగుతున్నాడు. ధనుష్ నిర్ణయానికి తెలుగు సినీ ప్రేమికులు ఎంతగానో సంబరపడుతున్నారు. అదే సమయంలో విజయ్, అజిత్‌లను తెగ తిట్టేసుకుంటున్నారు. మరి విజయ్, అజిత్‌లు ధనుష్ ని చూసి బుద్ధి తెచ్చుకోని ఇకనైనా మారుతారెమో చూడాలి?

మరింత సమాచారం తెలుసుకోండి: