ప్రభాస్ కొత్త లుక్ లో ఫోటో ఏదైనా సోషల్ మీడియాలో ప్రత్యక్షమైందంటే చాలు అది చూసి పగటి కలల్లోకి వెళ్ళిపోతూ ఉంటారు లేడీ ఫ్యాన్స్. అయితే సాధారణంగా ఇటీవల కాలంలో ఎంతోమంది గడ్డాన్ని స్టైల్ కోసం పెంచుకోవడం లాంటివి చేస్తూ ఉంటారు. కానీ ప్రభాస్ మాత్రం గడ్డం పెంచడం వెనక ఒక ఎమోషనల్ స్టోరీ ఉందట. అయితే ప్రభాస్ కేవలం మంచి లుక్ లో కనిపించడానికి కాదు తన తండ్రి కోసం గడ్డం పెంచుతాడట. చాలామందికి కృష్ణంరాజు ప్రభాస్ ఇండస్ట్రీలో నిలదొక్కుకోవడానికి వెన్నుదన్నుగా నిలిచాడని అంటూ ఉంటారు.
కానీ ప్రభాస్ తండ్రి సూర్యనారాయణ రాజుకి కూడా అటు చిత్ర పరిశ్రమలో మంచి సంబంధాలు ఉన్నాయట. ఆయనకు ఒక డైనమిక్ నిర్మాతగా కూడా పేరు ఉంది. గోపి మూవీస్ బ్యానర్ పై కృష్ణంరాజు నటించిన ఎన్నో సినిమాలను సూర్యనారాయణ రాజు నిర్మించేవారు. ఇక ప్రతి విషయంలో కూడా అన్నకు చేదోడు వాదుడుగా ఉండేవారు అని చెప్పాలి. అయితే అనూహ్యంగా ఆయన 2010లో అకాల మరణం చెందారు. దీంతో ఇక తండ్రి సూర్యనారాయణ రాజుపై మాటల్లో చెప్పలేనంత ప్రేమ ఉన్న ప్రభాస్ ఆయన గుర్తు వచ్చిన ప్రతిసారి అద్దం ముందుకెళ్లి తనను తాను చూసుకుంటారట. ఎందుకంటే సూర్యనారాయణ రాజుని జిరాక్స్ మిషన్లో వేస్తే ఎలా ఉంటాడో ప్రభాస్ కు అలాంటి పోలికలే కలిగి ఉంటాయి. అందుకనే ఇక గడ్డంతో తనని తాను చూసుకుంటే తన తండ్రిని చూస్తున్న ఫీలింగ్ కలుగుతుందని ఇక గడ్డం పెంచుకుంటాడట ప్రభాస్. ఈ విషయాన్ని ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు..
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి