మాస్ కా దాస్ విశ్వక్ సేన్ తాజాగా పక్క మాస్ ఎంటర్టైనర్ మూవీ లో హీరో గా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ లో నివేత పేతురాజ్ ... విశ్వక్ సరసన హీరోయిన్ గా నటించింది. ఈ మూవీ లో విశ్వక్ నటించడం మాత్రమే కాకుండా ఈ సినిమాకు దర్శకత్వం కూడా వహించాడు. విశ్వక్ తన కెరియర్ లో ఇది వరకే పలక నామ దాస్ అనే సినిమాలో హీరో గా నటించడం మాత్రమే కాకుండా ఆ మూవీ కి దర్శకత్వం కూడా వహించాడు.

 అలా ఇప్పటికే ఒక మూవీ.లో నటించి అదే మూవీ కి దర్శకత్వం వహించిన విశ్వక్ మరో సారి దాస్ కా దమ్కీ మూవీ తో నటించి అదే మూవీ కి దర్శకత్వం వహించాడు. ఇది ఇలా ఉంటే ఈ మూవీ మార్చి 22 వ తేదీన మంచి అంచనాల నడుమ థియేటర్ లలో విడుదల అయింది. ఈ మూవీ కి విడుదల అయిన మొదటి రోజు మొదటి షో కే మంచి టాక్ లభించడంతో ఈ మూవీ కి ఫస్ట్ డే మంచి కలెక్షన్ లు ప్రపంచ వ్యాప్తంగా దక్కాయి. అలాగే ఈ మూవీ కి రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా సూపర్ కలెక్షన్ లు లభించాయి.

విశ్వక్ కెరియర్ లోనే ఈ మూవీ రెండు తెలుగు రాష్ట్రాల్లో హైయెస్ట్ కలెక్షన్ లను వసూలు చేసిన మూవీ గా నిలిచినట్లు తెలుస్తోంది. ఈ మూవీ మొదటి రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 3.06 కోట్ల కలెక్షన్ లను వసూలు చేసింది. ఇది వరకు విశ్వక్ నటించిన ఏ సినిమా కూడా ఈ రేంజ్ కలెక్షన్ లను రెండు తెలుగు రాష్ట్రాల్లో రాబట్ట లేదు. ఇలా విశ్వక్ ఈ మూవీ తో తన కెరియర్ లోనే హైయెస్ట్ కలెక్షన్ లను రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ మూవీ తో రాబట్టాడు. ప్రస్తుతం కూడా ఈ మూవీ కి మంచి కలెక్షన్ లు బాక్స్ ఆఫీస్ దగ్గర లభిస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: