సూపర్ స్టార్ మహేష్ బాబు గురించి ఆయన స్టార్ పవర్ గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. మహేష్ నటించిన ఎన్నో సినిమాలు హిట్ ... ఫ్లాప్ లతో ఏ మాత్రం సంబంధం లేకుండా బాక్స్ ఆఫీస్ దగ్గర అదిరిపోయే రేంజ్ కలెక్షన్ లను వసూలు చేసిన సందర్భాలు అనేకం ఉన్నాయి. ఇలా తనకంటూ ఒక అద్భుతమైన మార్కెట్ ను క్రియేట్ చేసుకున్న మహేష్ ప్రస్తుతం మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందుతున్న మూవీ లో హీరోగా నటిస్తున్నాడు.

మూవీ మహేష్ కెరియర్ లో 28 వ మూవీ గా రూపొందుతుంది. ఈ మూవీ లో పూజా హెగ్డే ... శ్రీ లీల హీరోయిన్ లుగా కనిపించనున్నారు. ఇది వరకే పూజా హెగ్డే మహేష్ తో కలిసి మహర్షి మూవీలో నటించగా ... శ్రీ లీల ... మహేష్ తో కలిసి నటిస్తున్న మొట్ట మొదటి మూవీ ఇదే. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ మూవీ యూనిట్ ఈ సినిమా విడుదల తేదీని ప్రకటిస్తూ ఒక పోస్టర్ ను విడుదల చేసింది. ఈ పోస్టర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో అదిరిపోయే రేంజ్ లో వైరల్ అవుతుంది.

ఇది ఇలా ఉంటే ఈ మూవీ విడుదల తేదీన ప్రకటిస్తూ విడుదల చేసిన పోస్టర్ లో మహేష్ అదిరిపోయే స్టైలిష్ లుక్ లో నడుచుకుంటూ వస్తూ సిగరెట్ కాలుస్తున్నాడు. ఇది ఇలా ఉంటే మహేష్ ఆఖరుగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రూపొందిన అతిధి సినిమాలో సిగరెట్ తాగుతూ కనిపించాడు. ఆ తర్వాత ఏ సినిమాలో కూడా సిగరెట్ తాగుతూ కనిపించలేదు. ఈ సినిమా విడుదల అయ్యి 16 సంవత్సరాలు అవుతుంది. 16 సంవత్సరాల తర్వాత ఈ సినిమాలో మహేష్ సిగరెట్ తో కనిపించాడు. ఇది ఇలా ఉంటే ఈ మూవీ ని వచ్చే సంవత్సరం జనవరి 13 వ తేదీన విడుదల చేయనున్నట్లు ఈ మూవీ యూనిట్ ప్రకటించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: