తెలుగు సినిమా ఇండస్ట్రీ లో అద్భుతమైన మాస్ యాక్షన్ హీరో గా పేరు తెచ్చుకున్న గోపీచంద్ గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. హీరోగా కెరియర్ ను మొదలు పెట్టి ఆ తర్వాత విలన్ గా అదిరిపోయే క్రేజీ ను సంపాదించుకొని ఆ తర్వాత మళ్లీ హీరోగా నటించి అనేక విజయాలను అందుకొని ప్రస్తుతం గోపీచంద్ తెలుగు సినిమా ఇండస్ట్రీ లో ఫుల్ క్రేజీ హీరో గా కెరియర్ ను కొనసాగిస్తున్నాడు. గోపీచంద్ ఆఖరుగా పక్కా కమర్షియల్ అనే మూవీ లో హీరోగా నటించాడు.

 ఈ మూవీ ప్రేక్షకులను పెద్దగా ఆకట్టు కోలేక పోయింది. రాశి కన్నా హీరోయిన్ గా నటించిన ఈ మూవీ కి మారుతి దర్శకత్వం వహించాడు. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం గోపీచంద్ ... శ్రీ వాసు దర్శకత్వంలో రూపొందుతున్న రామబాణం అనే సినిమాలో హీరో గా నటిస్తున్నాడు. ఈ మూవీ లో డింపుల్ హయాతి హీరోయిన్ గా నటిస్తూ ఉండగా ... మిక్కీ జె మేయర్మూవీ కి సంగీతం అందిస్తున్నాడు.

 పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ సంస్థ పై టిజి విశ్వప్రసాద్, వివేక్ కూచిభోట్ల ఈ మూవీ ని నిర్మిస్తున్నాడు. ఇది ఇలా ఉంటే ఇది వరకే గోపీచంద్ శ్రీ వాసు కాంబినేషన్ లో లక్ష్యం ... లౌక్యం అనే రెండు మూవీ లు రూపొంది మంచి విజయాలను అందుకున్నాయి. దానితో రామ బాణం మూవీ పై ప్రేక్షకులలో మంచి అంచనాలు ఉన్నాయి. ఇది ఇలా ఉంటే ఇప్పటికే రామ బాణం మూవీ నుండి చిత్ర బృందం కొన్ని ప్రచార చిత్రాలను విడుదల చేసింది. అవి సూపర్ గా ఉండడంతో ఈ మూవీ పై ప్రేక్షకులలో అంచనాలు భారీగా ఉన్నాయి. మరి మరోసారి యాక్షన్ హీరోతో ఈ దర్శకుడు విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకుంటాడో లేదో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: