‘ఆర్ ఆర్ ఆర్’ మూవీతో ఏర్పడ్డ పాన్ ఇండియా ఇమేజ్ తరువాత లేటెస్ట్ గా ప్రారంభం అయిన జూనియర్ ఎన్టీఆర్ కొరటాల మూవీ షూటింగ్ ప్రారంభం అయి కనీసం వారం రోజులు కూడ పూర్తి కాకుండానే ఈ మూవీకి ఏర్పడ్డ క్రేజ్ టాపిక్ ఆఫ్ ది టాలీవుడ్ గా మారింది. టి సిరీస్ అధినేత భూషణ్ కుమార్ ఇప్పటికే ప్రభాస్ తో ‘ఆదిపురుష్’ మూవీని తీస్తున్న విషయం తెలిసిందే.

 

 
ఈమూవీ ఇంకా విడుదల కాకుండానే భూషణ్ కుమార్ అల్లు అర్జున్ తో ‘పుష్ప 2’ తరువాత ఒక భారీ పాన్ ఇండియా మూవీని చేయడానికి చర్చలు జరుపుతున్నాడు. అతడి దృష్టిలో ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ కూడ ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ ఆలోచనలో భాగంగానే జూనియర్ కొరటాల లేటెస్ట్ మూవీ బాలీవుడ్ రైట్స్ భారీ మొత్తానికి తీసుకుని ఆమూవీని ఉత్తరాది అంతా తాను విడుదల చేయాలని భూషణ్ కుమార్ ఇప్పటికే రాయబారాలు చేస్తున్నట్లు టాక్.

 

 
ఈమూవీలో హీరోయిన్ గా జాన్వీ కపూర్ కూడ నటిస్తూ ఉండటంతో ఈమూవీకి బాలీవుడ్ లో భారీ ఇమేజ్ ఏర్పడి ఆమూవీ సూపర్ హిట్ అవ్వడం ఖాయం అన్న అభిప్రాయంలో భూషణ్ కుమార్ ఉన్నట్లు తెలుస్తోంది. వచ్చే ఏడాది ఏప్రియల్ లో రాబోతున్న ఉగాది పండుగరోజున విడుదలకాబోయే ఈ మూవీ రిలీజ్ కు ఇంకా చాల సమయం ఉన్నా ఇప్పటి నుండే ఈమూవీ బిజినెస్ కు సంబంధించి ఆఫర్లు రావడం టాలీవుడ్ ఇండస్ట్రీ వర్గాలకు ఆశ్చర్యం కలిగిస్తోంది.

 

 
ఈమూవీ కథ రీత్యా ఒక షిప్పింగ్ హార్బర్ లో కొన్ని కీలక సన్నివేశాలు ఉంటాయి కాబట్టి ఒక ఆర్టిఫిషియల్ షిప్పింగ్ హార్భర్ ను అదేవిధంగా కొన్ని భారీ షిప్పుల ఆకృతితో ఉండే ఒక భారీ సెట్ లో ఈమూవీ షూటింగ్ జరగబోతోంది. ఈ భారీ సెట్ కోసం దాదాపు 10 కోట్లు ఖర్చుపెట్టారు అన్న వార్తలు కూడ వస్తున్నాయి..


మరింత సమాచారం తెలుసుకోండి: