మోస్ట్ బ్యూటిఫుల్ యాంకర్ కం నటి అయినటువంటి శ్రీ ముఖి గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ ముద్దు గుమ్మ ఇప్పటికే అనేక మూవీ లలో అనేక పాత్రలో నటించడం మాత్రమే కాకుండా ఎన్నో టీవీ షో లకు యాంకర్ గా వ్యవహరించి మంచి గుర్తింపును సంపాదించుకుంది. 

ఇది ఇలా ఉంటే ప్రస్తుతం శ్రీ ముఖి సినిమాల విషయానికి వస్తే భోళా శంకర్ అనే మూవీ లో ఒక ముఖ్యమైన పాత్రలో నటిస్తోంది  చిరంజీవి హీరో గా నటిస్తున్న ఈ మూవీ లో తమన్నా హీరోయిన్ గా నటిస్తూ ఉండగా ... మెహర్ రమేష్మూవీ కి దర్శకత్వం వహిస్తున్నాడు. కీర్తి సురేష్మూవీ లో కీలకమైన పాత్రలో నటిస్తోంది. ఈ మూవీ లో చిరంజీవి ... శ్రీ ముఖి కి మధ్య చాలా సన్నివేశాలు ఉండబోతున్నట్లు తెలుస్తోంది.

 అందులో భాగంగా పవన్ కళ్యాణ్ హీరోగా రూపొందిన ఖుషి మూవీ లోని నడుము సీన్ కూడా ఈ మూవీ లో పెట్టినట్లు తెలుస్తోంది. ఈ సీన్ కూడా అద్భుతంగా వచ్చినట్లు సమాచారం. ఇది ఇలా ఉంటే ఈ మధ్య కాలంలో శ్రీ ముఖి సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటూ వస్తుంది. అలాగే తనకు సంబంధించిన ఫోటోలను కూడా పోస్ట్ చేస్తుంది. తాజాగా శ్రీ ముఖి తన సోషల్ మీడియా అకౌంట్ లో బ్లాక్ కలర్ లో ఉన్న డ్రెస్ ను వేసుకొని మెడలో ఒక లాకెట్ ను ధరించి కిల్లింగ్ లుక్స్ లో తన నడుము అందాలు ప్రదర్శితం అయ్యేలా ఉన్న కొన్ని ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో అదిరిపోయే రేంజ్ లో వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: