వందల కోట్ల కలక్షన్స్ కు చిరునామాగా బాలీవుడ్ లో ఒక వెలుగు వెలిగిన సల్మాన్ ఖాన్ పరిస్థితి వరస ఫ్లాప్ లతో సతమతమైపోతోంది. సల్మాన్ ఖాన్ కు సెంటిమెంట్ గా కలిసివచ్చే రంజాన్ తనకు ఈఫ్లాప్ ల గండం నుండి గట్టెక్కిస్తుందని ఆశతో లేటెస్ట్ గా విడుదల చేసిన ‘కిసీ కా బాయ్ కిసీకా జాన్’ ఘోరమైన ఫ్లాప్ టాక్ తెచ్చుకోవడం షాకింగ్ గా మారింది.


ఈసినిమాకు మొదటిరోజు దేశవ్యాప్తంగా 15 కోట్లు కలక్షన్స్ మాత్రమే రాబట్టడం టాపిక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది. మొదటిరోజు రంజాన్ ఉపవాసాలు కారణంగా ఈమూవీకి తక్కువ కలక్షన్స్ వస్తాయి అని భావించినప్పటికీ ఈమూవీ కలక్షన్స్ ఆతరువాత రోజు అయిన రంజాన్ పండుగనాడు అదేవిధంగా వీకెండ్ రోజున అంతంతమాత్రంగా ఉండటంతో ఈమూవీ సూపర్ హిట్ అయ్యే ఆస్కారం లేదు అంటూ కామెంట్స్ వస్తున్నాయి.


ఇక తెలుగు రాష్ట్రాల పరిస్థితికి వస్తే ఈమూవీలో తెలుగు ప్రేక్షకులకు బాగా పరిచయం ఉన్న వెంకటేష్ భూమిక పూజా హెగ్డే జగపతి బాబులు ఈమూవీలో నటించినప్పటికీ ఈసినిమా తెలుగు డబ్బింగ్ పట్ల కనీస స్థాయిలో కూడ తెలుగు ప్రేక్షకులు పట్టించుకోక పోవడం మరింత ఆశ్చర్యంగా మారింది. సల్మాన్ గతంలో నటించిన ‘ఏక్ ధా టైగర్’ 33కోట్లు ‘కిక్’ 27 కోట్లు ‘సుల్తాన్’ 36 కోట్లు ‘భరత్’ కి 42 కోట్ల కలక్షన్స్ మొదటిరోజు తెచ్చుకున్న సల్మాన్ సినిమాకు కేవలం 16 కోట్లు రావడం అత్యంత ఆశ్చర్యంగా మారింది.


సల్మాన్ రేంజ్ తో పోల్చుకుంటే ఏమాత్రం నిలబడలేని సాయి ధరమ్ తేజ్ ‘విరూపాక్ష’ కు 12 కోట్లు రావడం పరిశీలిస్తే సల్మాన్ మ్యానియా పూర్తిగా తగ్గిపోతోందా అని అనిపించడం సహజం. ఈసినిమా పరాజయం చూసిన తరువాత సినిమా కథలో కొత్తదనం లేకపోతే ఆసినిమాలో టాప్ హీరో ఉన్నప్పటికీ ప్రేక్షకులు పట్టించుకోరు అన్నఅభిప్రాయం మరొకసారి వ్యక్తం కావడమే కాకుండా ప్రేక్షకుల అభిరుచిలో వస్తున్న మార్పులను సూచిస్తోంది..



మరింత సమాచారం తెలుసుకోండి: