అల్లరి నరేష్ హీరోగా చాలా కామెడీ సినిమాలు అయితే వచ్చాయి.ఒకప్పుడు కామెడీ సినిమాలు అంటే నరేష్ పేరు బాగా ఎక్కువగా గుర్తుకు వచ్చేది అయితే కొన్ని కామెడీ షోలు రావడంతో అల్లరి నరేష్ సినిమాలకి డిమాండ్ కూడా తగ్గింది అవి సరిగ్గా ఆడలేదు ఇక దాంతో రూట్ మార్చి నాంది అనే సినిమాను తీశారు అది సూపర్ హిట్ అయింది ఇక దాంతో ప్రస్తుతం 'ఉగ్రం'  అనే సినిమా తీస్తున్నారట .అయితే అంతకు ముందు తను ప్లాప్ అవుతున్న సరే కామెడీ సినిమాలే తీస్తూ జనాలకి తెగ బోర్ కొట్టించాను అని అసలు ఆ సినిమాలు తీయకపోయుంటే బాగుండేది అని ఆయన ఇంతకు ముందు జరిగిన ఒక ఇంటర్వ్యూ లో కూడా తెలియజేశారు.ప్రస్తుతం ఆయన ఉగ్రమ్ సినిమా షూటింగ్ లో ఉన్నారట.

దాంట్లో భాగంగా ఆయన ఆరోగ్యం కాస్త పాడయ్యింది దగ్గుతో చాలా ఇబ్బంది పడ్డట్టు కూడా తెలుస్తుంది. అందుకు కారణం.. విపరీతంగా సిగరెట్స్ కాల్చటమే అని తెలుస్తుంది.సాధారణంగానే సిగరెట్స్ తాగితే ఆరోగ్యం పాడవుతుంది. అలాంటి నాలుగు రోజుల్లో 500 సిగరెట్స్ తాగితే ఇంకేమైనా ఉందా? అయితే నరేష్ 4 రోజుల్లో 500 సిగరెట్స్ తాగారని తెలుస్తుంది.. అంటే రోజుకి వందకి పైగా సిగరెట్స్ తాగారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ఇంటర్వ్యూలో తెలియజేశారట.. మరి ఇంతకీ అంత మొత్తంలో సిగరెట్స్ను నరేష్ తాగటానికి కారణం కూడా షూటింగ్ అనే ఆయన అన్నారు. ఇక ఇప్పుడు ఆయన కామెడీ సినిమాలు కాకుండా సీరియస్ సినిమాలు చేయటానికి మొగ్గు చూపుతున్నారట.అందుకు బెస్ట్ ఎగ్జాంపుల్ నాంది అయితే అదే కోవకి చెందిన సినిమా ఉగ్రం నాంది చిత్రానికి దర్శకత్వం వహించిన విజయ్ కనక మేడల ఇప్పుడు ఉగ్రం సినిమాను రూపొందిస్తున్నారట..వయసుతో సంబంధం లేకుండా చాలా మంది కనిపించకపోవటం, కిడ్నాప్లకు గురి కావటాన్ని మనం వార్తల రూపంలో అయితే చూస్తుంటాం. అలాంటి కిడ్నాప్లను చేసే ఓ ముఠా, దాన్ని పట్టుకోవాలనుకునే పోలీస్ ఆఫీసర్.. అతను ఎదుర్కొన్న ఇబ్బందులు.చివరకు ఎలాంటి సక్సెస్ అందుకున్నారనే కథాంశంతో రూపొందిన సినిమానే ఉగ్రం.అల్లరి నరేష్ కు జోడీగా మిర్నా నటించింది. షైన్ స్క్రీన్స్ బ్యానర్పై విజయ్ కనకమేడల దర్శకత్వంలో ఉగ్రం చిత్రాన్ని సాహు గారపాటి, హరీష్ పెద్ది  కలిసి నిర్మించారు. ఏప్రిల్ 28న మూవీ విడుదల అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: