అక్కినేని అఖిల్ హీరోగా నటించిన ఏజెంట్ సినిమా నిన్న భారీ అంచనాల మధ్య విడుదలై విపరీతమైన నెగిటివ్ ని అందుకుంది. సురేందర్ రెడ్డి డెబ్యూ డైరెక్టర్ కన్నా అన్యాయంగా ఈ సబ్జెక్టుని తీసుకున్నారు అంటూ అఖిల్ అభిమానులు భారీ ఎత్తున మండిపడుతున్నారు. ఇంత కష్టపడి అఖిల్ బాడీ బిల్డ్ చేసుకొని దాదాపు మూడేళ్లు కేటాయించి ఈ సినిమా తీస్తే రిజల్ట్ ఇలా ఉంటుందని ఎవరు ఊహించలేదు. అయితే ఇదంతా గమనిస్తున్న అఖిల్ తల్లి అమల తాజాగా ట్రోల్స్ పై స్పందించింది. నిన్ననే థియేటర్కు వెళ్లి ఏజెంట్ సినిమా చూశాను.. ఏజెంట్ సినిమా చూసినప్పుడు అన్ని వర్గాల కుటుంబ ప్రేక్షకులు సినిమా చూడడానికి వచ్చారని.. 

యాక్షన్ సీన్లు వచ్చినప్పుడు వాళ్ళు అరుపులతో కొత్త ఉత్సాహం వచ్చిందని.. ఆమె కాస్త మోటివేషన్ ఇచ్చే ప్రయత్నం చేసింది ..ఈ సినిమాపై వస్తున్న ట్రోలింగ్లను అర్థం చేసుకున్నానని.. ఇది ఎప్పుడు లోతైన అభద్రత భావం నుంచి పుడుతుందని ..అంతేకాదు కచ్చితంగా ఈ సినిమా తర్వాత రాబోయే సినిమా దీని కన్నా మెరుగ్గా గొప్పగా ఉంటుందని చెప్పకు వచ్చింది.. తాజాగా అమల షేర్ చేసిన పోస్ట్ చూసిన వారందరూ షాక్ కి గురవుతున్నారు.. మొదటిసారిగా అమల ఎంత ఓపెన్ కావడంతో అందరూ షాక్ అవుతున్నారు.. అఖిల్ హీరోగా ఇండస్ట్రీకి చాలా ఏళ్లు గడుస్తుంది. ఇన్నేళ్లు అవుతున్నప్పటికీ అఖిల్ కి ఒక పెద్ద బ్లాక్ బస్టర్ సినిమా అన్నది లేదు.

ఈ సినిమాతో అయినా అఖిల్ కోరిక నెరవేరుతుందని ఈ సినిమాపై భారీ నమ్మకంతో ఉన్నాడు అఖిల్. ఆ నమ్మకంతోనే ఈ సినిమాకి సంబంధించిన ప్రమోషన్లను కూడా భారీ ఎత్తున చేశారు. రాత్రి పగలు అన్న తేడా లేకుండా బోలెడన్ని ఇంటర్వ్యూలను ఇచ్చారు. నిర్మాత పిలిచిన ప్రతిసారి వెళ్లి పబ్లిసిటీలో భాగమయ్యారు. కానీ తీరా చూస్తే ఎవరూ ఊహించని స్థాయిలో ఈ సినిమా డిజాస్టర్ గా నిలిచింది. సాధారణంగా అందరూ హీరోలకి డిజాస్టర్లు వస్తాయి. కానీ అఖిల్ కు మాత్రం ఈసారి ఈ సినిమా డిజాస్టర్ కాకపోతే బాగుండు అని అందరూ భావిస్తున్నారు. అలా తన మనసులో మాట చెప్పినప్పటికీ ఈ విషయంపై నాగార్జున ఎలా రియాక్ట్ అవుతాడు అన్నది చూడాల్సి ఉంది..!!

మరింత సమాచారం తెలుసుకోండి: