హీరో రామ్ పోతినేని నటించిన దేవదాసు చిత్రం ద్వారా మొదటిసారిగా హీరోయిన్గా పరిచయమైంది ఇలియానా. ఆ తర్వాత పోకిరి సినిమాతో ఓవర్ నైట్ కి స్టార్ హీరోయిన్గా పేరు సంపాదించడమే కాకుండా టాలీవుడ్ లో అప్పటివరకు అత్యధిక రెమ్యూనరేషన్ అందుకున్న హీరోయిన్గా కూడా పేరు సంపాదించింది. అలాంటి సమయంలో బాలీవుడ్ వైపుకు వెళ్లి తన కెరియర్ను నాశనం చేసుకుంది ఇలియానా. బాలీవుడ్లోకి బర్ఫీ సినిమా ద్వారా ఎంట్రీ ఇచ్చిన ఆ సినిమా పరవాలేదనిపించకుంది .ఆ తర్వాత కొన్ని సినిమాలలో అవకాశాలు వచ్చిన సక్సెస్ కాలేక పోయింది.
ఆ తర్వాత కెరియర్ పరంగా డౌన్ అయింది ఇలియానా. ఈ మధ్యకాలంలో సినిమాలలో పెద్దగా కనిపించకపోయిన సోషల్ మీడియాలో తరచు తన గ్లామర్ ఫోటోలను సైతం షేర్ చేస్తూ ఉంటుంది.ఇటీవల తాను కూడా కొత్త జీవితంలోకి అడుగు పెట్టాలని భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. అందుకే ఆమె తల్లి కాబోతున్నానని విషయాన్ని సోషల్ మీడియా ద్వారా తెలియజేసి అందరికి షాక్ ఇచ్చింది. ఇప్పటివరకు ఇలియానా వివాహం చేసుకోలేదు.. కానీ ఎవరితో రిలేషన్స్ ఉందని విషయాన్ని కూడా తెలియజేయలేదు.కానీ ఇలియానా మాత్రం ప్రెగ్నెంట్ అనే విషయాన్ని పదేపదే సోషల్ మీడియా ద్వారా రివిల్ చేయడం జరిగింది. అంతేకాకుండా పలు రకాల బేబీ బంప్ ఫోటోలను సైతం షేర్ చేస్తూనే ఉంది.ఇలియానా తాజాగా బీచ్ లో ఎండలో ఉంటూ బికినీలో సేద తీరుతు బేబీ బంప్ ఫోటోలను షేర్ చేసింది. దీంతో అందరి దృష్టి ఇలియానా వైపు మళ్ళినట్టుగా కనిపిస్తోంది.. ఈ మధ్యకాలంలో ఇలియానా ప్రెగ్నెంట్ కారణంగా మరింత బరువు పెరిగినట్టుగా కనిపిస్తోంది అంటూ పలువురు నెట్టిజెర్ల సైతం కామెంట్లు చేస్తున్నారు. మొత్తానికి ఇలియానా ప్రెగ్నెంట్ అయినా కూడా బేబీ బంప్ లో కూడా బికినీ ఫోటోలను మాత్రం విడిచిపెట్టలేదని చెప్పవచ్చు. ప్రస్తుతం ఇలియానా షేర్ చేసిన ఈ ఫోటోలు తెగ వైరల్ గా మారుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: